Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

వైఎస్సార్ జలకళ: ఈ పథకానికి అర్హులు ఎవరు? - vandebharath

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రైతులకు ఉచితంగా బోరు బావులు వేయించేందుకు ...

 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రైతులకు ఉచితంగా బోరు బావులు వేయించేందుకు ‘వైఎస్సార్ జలకళ’ పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.

ఈ పథకం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని జగన్ అంటున్నారు. కానీ, రాష్ట్రంలో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న భూగర్భ జలాల పరిస్థితి ఈ పథకంతో మరింత దిగజారే అవకాశాలున్నాయని పలువురు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియంత్రణ లేకుండా, ఉచితంగా బోర్లు వేయిస్తే భవిష్యత్తు ప్రమాదంలో పడవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది..

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1.62 కోట్ల హెక్టార్ల భూమి ఉంది. అందులో 22.6 శాతం అటవీ ప్రాంతం కాగా, మరో 12.6 శాతం వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇక మిగిలిన భూమిలో నికరంగా వ్యవసాయానికి అందుబాటులో ఉన్న ప్రాంతం 60.48 లక్షల హెక్టార్లు. ఇది 37.1 శాతంగా ఉంది.

సాగుబడిలో ఉన్న భూమిలో కాలువల ద్వారా నీటి లభ్యత ఉన్న ప్రాంతం సుమారు 47 శాతం. 42.5 శాతం భూములకు బోరు బావులు ఆధారంగా ఉన్నాయి. మరో 7 శాతం భూములకు చెరువుల ద్వారా సాగునీరు లభిస్తోంది.

ఇప్పుడు వైఎస్ఆర్ జలకళ ద్వారా మరో 5 లక్షల ఎకరాలకు బోరు బావుల ద్వారా నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 2 లక్షల బోర్లు ఉచితంగా వేయిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

2.5 ఎకరాలకుపైగా భూమి ఉన్న రైతులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతకన్నా తక్కువ భూమి ఉన్న రైతులైతే, ఇద్దరు ముగ్గురు పోగై బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రామ సచివాలయం ద్వారా ఈ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి, జియాలజిస్టు ఆమోదం లభించిన తర్వాత డ్వామా ఏపీడీ ద్వారా అనుమతిస్తారు. కాంట్రాక్టర్ ద్వారా బోర్ బావి తవ్విస్తారు.

మొదటిసారి బోరులో నీరు పడకపోతే, రెండోసారి కూడా వేస్తారు. జియో ట్యాగింగ్ చేసిన తర్వాత కాంట్రాక్టర్‌కి బోరుకు అయిన ఖర్చుని ప్రభుత్వం చెల్లిస్తుంది.