Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఆమ్నెస్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిన భారత ప్రభుత్వం- vandebharath

  భారత దేశంలో కార్యకలాపాలు నిలిపివేస్తున్నాం : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత ప్రభుత్వం ఆమ్నెస్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది అంతర్జాతీయ మానవ ...

 


  • భారత దేశంలో కార్యకలాపాలు నిలిపివేస్తున్నాం : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
  • భారత ప్రభుత్వం ఆమ్నెస్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది

అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత దేశం నుంచి తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిందని అమ్నెస్టీ ఇండియా ఆరోపించింది. 2020 సెప్టెంబర్ 10న తన బ్యాంకు ఖాతాలన్నీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా స్తంభింపజేసిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీంతో తీవ్ర వేదన, దుఃఖం, భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ప్రభుత్వ ప్రతీకార చర్యల కారణంగానే తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని తెలిపింది. అవాస్తవాలు, ఉద్దేశపూరక ఆరోపణలపై మానవ హక్కుల సంస్థలను భారత ప్రభుత్వం మంత్ర గత్తెలా వేటాడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.

ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ -2010 (ఎఫ్‌సీఆర్ఏ) నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై 2019 నవంబర్ 5న  సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. సంస్థ ప్రధాన కార్యాలయంపై  దాడులు నిర్వహించింది. అలాగే గత ఏడాది ఈడీ ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మనీలాండరింగ్ ఆరోపణలతో తాజాగా ఇండియాలో ఆమ్నెస్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడంతో తాజా పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రభుత్వం గత కొన్నేళ్ళుగా లెక్కలు సరిగా చూపని ఇలాంటి సంస్థలను కూడా రద్దుచేసింది. ఈ మానవ హక్కుల సంస్థ కూడా అలాంటి వాటిలో ఒకటి అని ఆరోపణలు ఎదుర్కోంటొంది