Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

టాలీవుడ్ డ్రగ్స్ కేసు నీరుగార్చే కుట్ర! -పద్మనాభ రెడ్డి - vandebharath

  గతంలో తీవ్ర కలకలం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులకు సంబంధించి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయక పోవడంతో వారిపై కేసును నీరు...

 


గతంలో తీవ్ర కలకలం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులోటాలీవుడ్ ప్రముఖులకు సంబంధించి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయక పోవడంతో వారిపై కేసును నీరుకార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చూస్తున్నట్లు వెల్లడి అవుతుంది. 
 
ఈ కేసుకు సంబంధించిన సమాచారం కోసం ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌, ఆర్టీఐకి దరఖాస్తు పెట్టుకోగా ఈ కేసును నీరుకార్చేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు కుట్ర జరుగుతోందని స్పష్టం అవుతున్నల్టు  ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఆరోపించారు. 
 
ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కోసం ఆర్ టి ఐ ద్వారా దరఖాస్తు చేసుకోగా తమకు 8 ఛార్జీ షీట్ల వివరాలు మాత్రమే ఇచ్చారని ఆయన తెలిపారు.  గత రెండేళ్లలో మొత్తం 12 కేసులు నమోదు కాగా, 8 కేసులలో మాత్రమే ఛార్జ్ షీట్ లు నమోదు చేయడం పలు అనుమానాలకు దారితీస్తుంది. 
 
మిగిలిన 4 కేసుల్లో టాలీవుడ్ కు సంబంధించి ప్రముఖులపై ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులు నమోదైన సమయంలో మా అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసారని ఆయన గుర్తు చేశారు. 
 
ఈ వ్యవహారాన్ని బయటకు రాకుండా ఉండేందుకు వారు ముఖ్యమంత్రిని  కోరి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో ఉన్న ప్రతి ఒక్కరిపై ఛార్జ్ షీట్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు.  అప్పటి వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
 
సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ కేసులో 72 మంది పేర్లు ఉండగా, విచారణకు హాజరైన 12 మందితో మరో 60 మంది జాబితాను వెల్లడించింది.
 
జర్మనీ, బ్రిటన్‌, ఇంగ్లాండ్‌ల నుంచి కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ సప్లై అవుతోంది. విదేశాల నుంచి స్టీల్‌ బౌల్స్‌ పేరుతో కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ www.ipsld.lo వెబ్‌సైట్‌ ద్వారా స్టూడెంట్స్‌ డ్రగ్స్‌ బుకింగ్‌ చేస్తున్నట్లు ఛార్జ్‌షీట్‌ లో ఎక్సైజ్‌శాఖ వెల్లడించింది. 
 
సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ మహేశ్వర ఫార్మాలో సైతం డ్రగ్స్‌ అమ్మకాలు జరుగుతన్నట్లు తెలిపింది. ఎనిమిది చార్జిషీట్లలో కాలేజీ విద్యార్థుల‌తో పాటు ప్రముఖుల పేర్లు ఉన్నాయి.