భారత్-శ్రీలంక ప్రధానుల మధ్య నేడు వర్చువల్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా రెండు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానులు ఇ...
భారత్-శ్రీలంక ప్రధానుల మధ్య నేడు వర్చువల్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా రెండు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానులు ఇద్దరూ చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..భారత్-శ్రీలంక దేశాల మధ్య కొనసాగుతున్న బంధం ఈనాటిది కాదని, వేల ఏండ్ల నాటిదని ప్రధాని మోడి అన్నారు.
ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై వర్చువల్ రీతిలో చర్చిద్దామన్న తన ప్రతిపాదనను అంగీకరించినందుకు శ్రీలంక ప్రధాని రాజపక్షేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని అయినందుకు రాజపక్షేను అభినందించారు.
శ్రీలంకతో సంబంధాలకు తాము ఎప్పుడైనా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని ప్రధాని మోడి పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల్లో సైతం భారత్ తమ దేశానికి అందించిన సహకారానికి కృతజ్ఞతలు అని శ్రీలంక ప్రధాని పేర్కొన్నారు.