శామీర్‌పేటలోని భారత్ బయోటెక్ సంస్థను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మంగళవారం సందర్శించారు. కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో భాగస్వ...
శామీర్‌పేటలోని భారత్ బయోటెక్ సంస్థను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మంగళవారం సందర్శించారు. కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో భాగస్వాములైన శాస్ర్తవేత్తలతో గవర్నర్ మాట్లాడారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. శాస్ర్తవేత్తలు వ్యాక్సిన్‌పై అత్యంత శ్రద్ధ పెట్టి పని చేస్తున్నారని తెలిపారు.
ప్రధాని మోదీ చెప్పినట్లు భారత్‌లోనే కరోనా వ్యాక్సిన్ తయారీకి అవకాశాలు ఎక్కువ అని పేర్కొన్నారు. వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న శాస్ర్తవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా వ్యాక్సిన్ తయారీపై దృష్టి పెట్టారని చెప్పారు. తక్కువ ధరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. భారత్ బయోటెక్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు.