Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

తెలంగాణలో మే 21 వరకు లాక్ డౌన్ - corona - telangana lockdown will extend two weeks

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అడుగుజాడలలో తెలంగాణలో సహితం మరో రెండు వారాలపాటు లాక్ డౌన్ ను పొడిగించే దిశలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అడుగ...


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అడుగుజాడలలో తెలంగాణలో సహితం మరో రెండు వారాలపాటు లాక్ డౌన్ ను పొడిగించే దిశలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. జాతీయ స్థాయిలో నేటి నుండి మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగించడం తెలిసింది. ఇది ఈ నెల 17 వరకు కొనసాగుతుంది.

అయితే తెలంగాణలో ఈ నెల 7న ముగియనున్న లాక్ డౌన్ అనంతరం అనుసరించ వలసిన వ్యూహం గురించి రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశం కానున్నది. ఈ లోగా ఈ విషయమై క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడంతో పాటు సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో కేసీఆర్ సమంలోచనలు జరుపుతున్నారు.

ఈ సందర్భంగా లాక్ డౌన్ పొడిగింపు పట్ల సుముఖత వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తున్నది. రేపటి మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లోని హాట్ పోస్ట్ లలో పెరుగుతున్న కేసుల పట్ల కేసీఆర్ ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తున్నది. తెలంగాణలో కొత్తగా నమోదవుతున్న కేసులలో అత్యధికం ముఖ్యంగా చార్మినార్ జోన్ నుండే వస్తున్నాయి.

మరోవంక, తెలంగాణలో కరొనతో ఆసుపత్రిలలో చేరిన వారిలో దాదాపు సగం మంది కోలుకొని, ఇంటికి వెళ్లడం పట్ల తెలంగాణ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తున్నది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా బాధితుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య కంటే రికవరీ సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేస్తున్నది.

మార్చి 2వ తేది నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1082 మందికి వైరస్ బారిన పడ్డారు. వీరిలో ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరిన వారి సంఖ్య 545 ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 508గా ఉంది. మరో 29 మంది మరణించారు.

ఆదివారం కొత్తగా 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20 కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలోనీవే కావడం గమనార్హం. దీంతో పాటు కొత్తగా జగిత్యాల జిల్లాల్లో ఒకరికి వైరస్ సోకింది.

ఇలా ఉండగా, హైదరాబాద్ వనస్థలిపురంలో రోజురోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు కాలనీల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూడు కుటుంబాల ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిందనే ఆరోపణలు అధికంగా వస్తున్నాయి. దీంతో వనస్థలిపురంలోని హుడాసాయినగర్, ఎబిటైప్ కాలనీ, ఎస్‌కెడి నగర్, కమలానగర్, సచివాలయనగర్లలో వారం రోజుల పాటు కంటైన్మెంట్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

గత వారం రోజులుగా నమోదవుతున్న పాజిటివ్ కేసులన్నీ దాదాపు హైదరాబాద్ నుండే కావడం, ఇక్కడ కూడా మార్కెట్ల నుంచి వస్తుండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా హోల్‌సేల్ దుకాణాలపై నిఘా పెంచనున్నారు. నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాల ద్వారా ఇప్పటికే పలు రిటైల్ డీలర్లకు వైరస్ సోకింది.