తెరాస సీనియర్ నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌పై అసంతృప్తి గళం వినిపించారు....
తెరాస సీనియర్ నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌పై అసంతృప్తి గళం వినిపించారు. తనకు మంత్రిపదవి ఇస్తానని చెప్పి కేసీఆర్ మాటతప్పారని ఆరోపించారు.2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే.. మండలిలో ఉండు మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ అన్నారు. నా అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. నాకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి వద్దు. కేసీఆర్ మా ఇంటికి పెద్ద. మేమంతా ఓనర్లమే. కిరాయిదార్లు ఎంతకాలం ఉంటారో వాళ్లిష్టం’’ అని నాయిని వ్యాఖ్యానించారు.