Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

గృహనిర్బంధం పై చంద్రబాబు ఆగ్రహం - vandebharath

చలో ఆత్మకూరు కు వెళ్తున్న తనను గృహనిర్బంధం చేయడంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. తమ పార్టీ చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ...


చలో ఆత్మకూరు కు వెళ్తున్న తనను గృహనిర్బంధం చేయడంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. తమ పార్టీ చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న తెదేపా నేతల నిర్బంధ కాండపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఈ పరిస్థితులు చాలా దారుణం, దుర్మార్గమన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తనను గృహనిర్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతిలోని తన నివాసం నుంచి బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడారు. 
ఈ కార్యక్రమానికి వచ్చే తమ పార్టీ నాయకులను గృహనిర్బంధం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చిన వారిని అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలించడం.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి ఒక పోలీస్‌ స్టేషన్‌ నుంచి మరో పోలీస్‌ స్టేషన్‌కు తిప్పడం మంచి పద్ధతికాదని మండిపడ్డారు. ఆత్మకూరులో 120 ఎస్సీ కుటుంబాలు శిబిరంలో ఉంటే అక్కడిక భోజనాలు రానీయకుండా అడ్డుకుంటున్నారన్నారు. తమ ఇంట్లోకి పనివాళ్లను కూడా రానీయకుండా అడ్డుకున్నారని.. పోలీసులు అత్యుత్సాహంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారన్నారు. ఈ ఘటనలన్నీ పాలించే వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు.
మొత్తం 540 కుటుంబాలను వారి ఊళ్లోకి తీసుకెళ్లి అక్కడ వారు జీవించేందుకు అవకాశం కల్పించాలని తెదేపా కోరుకుంటోందన్నారు. మనిషికి జీవించే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ, వారి ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వీటిని పోలీసులు అమలు చేయాలన్నారు. నిన్నటి వరకు తాము గడువు ఇచ్చామని.. ఈ రోజు చలో ఆత్మకూరుకు బయల్దేరితే తనను అడ్డుకోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని నిలవరించలేరన్నారు. తమ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆపలేరన్నారు. చలో ఆత్మకూరు కొనసాగుతుందని స్పష్టంచేశారు. సమస్య పరిష్కారమయ్యేవరకూ వదిలిపెట్టే ప్రకస్తే లేదని చంద్రబాబు స్పష్టంచేశారు.