పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు జరిపి వారి స్థావరాలను విధ్వంసం చేసిన మరుసటి రోజుననే నేడు స్వదేశంలో ముష్కరుల ఏ...
పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు జరిపి వారి
స్థావరాలను విధ్వంసం చేసిన మరుసటి రోజుననే నేడు స్వదేశంలో ముష్కరుల ఏరివేత
చేపట్టింది. జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఎన్‌కౌంటర్ జరిపి జైషే మహ్మద్
ముఠాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది.
షోపియాన్‌లోని మీమెందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల
నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతాబలగాలు ఈ ఉదయం నిర్బంధ తనిఖీలు
చేపట్టాయి. ఈ క్రమంలో ఓ ఇంట్లో దాగి ఉన్న ముష్కరులు భద్రతాబలగాలపై కాల్పులు
జరిపారు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన సిబ్బంది ఇద్దరు ఉగ్రవాదులను
మట్టుబెట్టారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన సోమవారం పాక్‌లోని ఉగ్ర
శిబిరాలపై మెరుపుదాడులు చేపట్టిన విషయం తెలిసిందే. బాలాకోట్‌లోని జైషే ఉగ్ర
స్థావరంపై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో జైషే అధినేత మసూద్ అజార్
బావమరిది సహా 300 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.