Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

పాకిస్తాన్ నుండి విడుదలైన హమిద్‌ యువతకిచ్చే సందేశం ఏమిటి

హమీద్ నిహాల్ అన్సారీ.. 33 సంవత్సరాల ముంబై కి చెందిన ఇంజనీర్ 6 సంవత్సరాల పాటూ పాకిస్థాన్ జైలులో నరకం అనుభవించాడు. పాకిస్థాన్ కు చెందిన అమ్మాయ...

హమీద్ నిహాల్ అన్సారీ.. 33 సంవత్సరాల ముంబై కి చెందిన ఇంజనీర్ 6 సంవత్సరాల పాటూ పాకిస్థాన్ జైలులో నరకం అనుభవించాడు. పాకిస్థాన్ కు చెందిన అమ్మాయితో ముంబైకి చెందిన అన్సారీకి ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆమెకు బలవంతంగా పెళ్లి చేయబోతున్నారనే వార్తను తెలుసుకుని, ఆమెను కాపాడేందుకు ఆఫ్ఘనిస్థాన్ గుండా పాకిస్థాన్ లోకి అడుగుపెట్టాడు. పాక్ సైన్యం చేతికి చిక్కాడు. గూఢచర్యం ఆరోపణలతో అన్సారీకి జైలు శిక్ష కూడా విధించారు. అయితే ఆరేళ్ళ తర్వాత ఎట్టకేలకు విడుదల అయ్యాడు. అతడు వాఘా బోర్డర్ లో భారత్  చేరుకున్నాడు. భారత విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ ను హమీద్ నిహాల్ అన్సారీ కలుసుకున్నాడు. ఆమెను కలుసుకున్న వెంటనే కన్నీటి పర్యంతమయ్యాడు. హమీద్ తో పాటూ అతడి తల్లి, కుటుంబ సభ్యులు బుధవారం నాడు సుష్మా స్వరాజ్ ను కలుసుకున్నారు. 

ఇక ఇప్పుడిప్పుడే మీడియాతో మాట్లాడుతూ ఉన్నాడు హమీద్. . ఫేస్ బుక్ ద్వారా ప్రేమలో పడకండని యువతకు సూచించాడు. మీ తల్లిదండ్రుల వద్ద ఏదీ దాయవద్దనీ.. కష్ట కాలంలో మీకు తోడుండేది తల్లదండ్రులేనని చెప్పాడు. ఫేస్ బుక్ ను నమ్మి ప్రేమలో పడవద్దు. రిస్క్ తీసుకోవద్దని సూచించాడు. అక్రమ పద్ధతులలో ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దు అని చెప్పాడు. పాకిస్థాన్ జైలు నుంచి విడుదల కాబోతున్నాననే వార్త వినగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని అన్సారీ చెప్పాడు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు జైలు సూపరింటెండెంట్ తన వద్దకు వచ్చారని.. అరగంటలో రెడీ అవ్వు అని చెప్పారని.. వెంటనే దుస్తులు మార్చుకుని, షూస్ వేసుకుని, వాహనంలో కూర్చున్నానని చెప్పాడు.

 మంగళవారం నాడు వాఘా-అట్టారి బోర్డర్ లో అతన్ని భారత అధికారులకు పాక్ అధికారులు అప్పగించారు. అన్సారీ తల్లి ఫౌజియా మాట్లాడుతూ.. అన్సారీ విడుదలకు ముఖ్య కారణం సుష్మా మేడమ్ అని చెప్పారు. మేరా భారత్ మహాన్.. మేరీ మేడమ్ మహాన్.. సబ్ కుచ్ మేడమ్ నే కియా హై(మొత్తం మేడమ్ సుష్మా చేశారు) అని చెప్పారు.