Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

అల్లు అర్జున్ బుక్ అయ్యాడు

అల్లు అర్జున్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది.బన్నీ ఏదైనా ఫంక్షన్ కి వచ్చాడంటే ఆ సినిమాకి ఆటోమాటిక్ గా బజ్ వచ్చేస్తుంది.ప్రస్తుతం బన్నీ నెక్స...

Image result for allu arjun
అల్లు అర్జున్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది.బన్నీ ఏదైనా ఫంక్షన్ కి వచ్చాడంటే ఆ సినిమాకి ఆటోమాటిక్ గా బజ్ వచ్చేస్తుంది.ప్రస్తుతం బన్నీ నెక్స్ట్ సినిమా ఇంకా ఖరారు కాకపోవడంతో కాస్త ఖాళీగా ఉన్నాడు.అందుకే బన్నీ అంటే అభిమానం ఉన్నవాళ్లు,అతనితో కాస్త పరిచయం ఉన్నవాళ్లు కూడా వాళ్ళ సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి బన్నీ ని ఆహ్వానిస్తున్నారు.గతంలో చాలా సినిమాల ఫంక్షన్స్ కి అటెండ్ అయిన బన్నీ కి సుకుమార్ తో స్పెషల్ బాండింగ్ ఉంది.అందుకే అతను సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మించిన దర్శకుడు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి బన్నీ ని స్పెషల్ గెస్ట్ గా పిలిచాడు.రిలీజ్ కి ముందు వరకు ఆ సినిమా పేరు వినని వాళ్ళుకి సైతం బన్నీ ఆ ఈవెంట్ కి అటెండ్ అవ్వడంతో ఆ సినిమాపై అటెన్షన్ ఏర్పడింది.

అల్లు అర్జున్ తమ్ముడు అయిన అల్లు శిరీష్ బయటి ప్రొడక్షన్ లో ఒక్క క్షణం అనే సినిమా చేసాడు.ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ VI ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమాకి ముందు పెద్దగా ఫేమ్ లేదు.కానీ శిరీష్ మీద ఉన్న ఇష్టంతో ఆ ఫంక్షన్ కి వచ్చాడు బన్నీ.నిజానికి అప్పటికి నా పేరు సూర్య…నా ఇల్లు ఇండియా షూటింగ్ లో ఉన్న బన్నీ ఆ ఫంక్షన్ కి రావడంతో బన్నీ కొత్త గెటప్ చూడడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు.అలా ఒక్క క్షణం సినిమాకి కూడా భారీ బజ్ వచ్చింది.ఇక గీత ఆర్ట్స్ లో తెరకెక్కి రిలీజ్ కి ముందే లీక్ బారిన పడ్డ విజయ్ దేవరకొండ సినిమా గీతగోవిందం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అటెండ్ అయ్యాడు బన్నీ.ముందు నుండి ఆ సినిమాకి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ కూడా బన్నీ ప్రెజన్స్ తో ఆ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయ్యింది.

గీతగోవిందం హిట్ తరువాత మళ్ళీ అనేక ప్రొబ్లెమ్స్ మధ్య థియేటర్స్ లోకి వచ్చిన సినిమా టాక్సీవాలా.ఆ సినిమా నిర్మాణంలో కూడా గీత ఆర్ట్స్ భాగస్వామ్యం ఉండడం,అలాగే ఆ సినిమా ప్రొడ్యూసర్ బన్నీ కి బాగా పరిచయం ఉన్న వ్యక్తి కావడం..ఇక విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కి బన్నీ కి నచ్చడంతో మళ్ళీ టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చి మరీ ఆ సినిమా హిట్ కి కూడా తనవంతు కంట్రిబ్యూషన్ అందించాడు.ఇకఆ ఇప్పడు యంగ్ హీరో శర్వానంద్ వంతు వచ్చింది.శర్వా కి రాంచరణ్ మంచి ఫ్రెండ్.అయితే ఈ శుక్రవారం శర్వా నటించిన పది పది లేచే మనసు సినిమాతో పాటుగా అంతరిక్షం కూడా రిలీజ్ అవుతుంది.ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రామ్ చరణ్ ముఖ్య అతిధిగా వెళుతున్నాడు.

అందుకే తన సినిమా ఫంక్షన్ కి కూడా మంచి అటెన్షన్ రావాలంటే మాత్రం మరో పెద్ద హీరో అండ అవసరం.దాంతో బన్నీని గెస్ట్ గా పిలిచారు.బన్నీ కూడా ఓకే చెప్పడంతో ఇప్పడు అందరి దృష్టి కూడా పడి పడి లేచె మనసు సినిమాపై పడింది.