Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

లోక్‌సభలో 50 శాతం సీట్ల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం - Union Cabinet Approves 50 Percent Increase in Lok Sabha Seats

లోక్‌సభలో సీట్ల సంఖ్యను 543 నుంచి 850కి పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ...

లోక్‌సభలో 50 శాతం సీట్ల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం

లోక్‌సభలో సీట్ల సంఖ్యను 543 నుంచి 850కి పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ కొత్త వ్యవస్థ 2050 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ చట్టాలు చేయనున్నారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లోనూ ఈ మహిళా రిజర్వేషన్లు అమలయ్యేలా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి.

నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక సమావేశాలు లోక్‌సభలో నవంబర్ 30, డిసెంబర్ 1న, రాజ్యసభలో డిసెంబర్ 2, 3 తేదీల్లో జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.

ఈ సధ్ధస్సుల నిర్వహణ కోసం లోక్‌సభ స్పీకర్‌ను, రాజ్యసభ ఛైర్మన్‌ను కోరినట్లు మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అత్యవసరమైన ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ ప్రత్యేక సమావేశాలు అత్యంత కీలకమైనవని ఆయన పేర్కొన్నారు.

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ప్రపంచం మన వైపు చూస్తోందని కిరణ్ రిజిజు చెప్పారు. సభ సజావుగా సాగేలా చూడటం సభ్యులందరి సామూహిక బాధ్యత అని ఆయన అన్నారు.