Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

బెంగళూరులో నేపాలీ మూలాలున్న హిందూ యువకుడి దారుణ హత్య - Nepali Hindu youth beaten to death in Bengaluru

బెంగళూరులో నేపాలీ మూలాలున్న 22 ఏళ్ల హిందూ యువకుడు అంబర్‌ను అతని స్నేహితులే దారుణంగా కొట్టి చంపారు. ఇటీవల కూతురు జన్మించడంతో చెడు సావాసాలకు ...

బెంగళూరులో నేపాలీ మూలాలున్న హిందూ యువకుడి దారుణ హత్య

బెంగళూరులో నేపాలీ మూలాలున్న 22 ఏళ్ల హిందూ యువకుడు అంబర్‌ను అతని స్నేహితులే దారుణంగా కొట్టి చంపారు. ఇటీవల కూతురు జన్మించడంతో చెడు సావాసాలకు దూరంగా ఉంటూ కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

హోరమావులో కుటుంబంతో కలిసి నివసించే అంబర్ లిఫ్ట్ రిపేర్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. 2024లో పూజా ఛెత్రిని వివాహం చేసుకున్న అతనికి, చనిపోవడానికి వారం రోజుల క్రితమే ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాత సయ్యద్ యూనస్ ముఠాకు దూరంగా ఉండాలని అంబర్ ప్రయత్నించాడు. అయితే తాము పిలిచినప్పుడల్లా రావాలంటూ సయ్యద్ యూనస్, తమ్హీమ్, ముదాసిర్, జునైద్ అలియాస్ కోలి అతడిపై ఒత్తిడి తెస్తూ తీవ్ర బెదిరింపులకు దిగేవారు.

చిన్నపాటి వివాదాలకే అంబర్‌పై ఆ ముఠా దాడి చేసేదని మృతుడి అన్న నాగరాజ్ తెలిపారు. అక్టోబరు నెలలో జరిగిన దాడిలో అంబర్ ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. పోలీసులకు ఫిర్యాదు చేయాలని కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ, వారు తన స్నేహితులేనంటూ అంబర్ నిరాకరించాడు.

నవంబర్ 18న తెల్లవారుజామున 5 గంటలకు అంబర్ ఇంటికి పాలు, బిస్కెట్లు తెచ్చి ఇచ్చాడు. పని ఉందని తల్లికి చెప్పి మోటార్ సైకిల్‌పై బయటకు వెళ్లిన అతను తిరిగి రాలేదు. అంబర్, యూనస్ ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో రెండు రోజుల పాటు గాలించిన కుటుంబ సభ్యులు హెన్నూరు పోలీసులను ఆశ్రయించారు. నవంబర్ 23న డీజే హళ్లి పోలీసులు అంబేద్కర్ ఆసుపత్రికి రావాలని సమాచారం ఇవ్వడంతో, అక్కడ అంబర్ మృతదేహాన్ని గుర్తించారు.