ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఫీనిక్స్ మార్కెట్‌సిటీ మాల్ ఎదురుగా శుభమ్ పర్మార్, అతని ఇద్దరు స్నేహితులపై నవంబర్ 20 రాత్రి 13 నుంచి 15 మంది వ్య...

ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఫీనిక్స్ మార్కెట్‌సిటీ మాల్ ఎదురుగా శుభమ్ పర్మార్, అతని ఇద్దరు స్నేహితులపై నవంబర్ 20 రాత్రి 13 నుంచి 15 మంది వ్యక్తులు దాడి చేశారు. మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగుల ముఠా వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ దాడిలో శుభమ్ తీవ్రంగా గాయపడ్డాడు.
బాధితుడు శుభమ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు కుట్లు వేశారు. అతని పళ్లు విరిగిపోవడమే కాకుండా పెదవులకు కూడా కుట్లు పడ్డాయి. అయితే ఘటన జరిగి నాలుగు రోజులైనా వినోబా భావే నగర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా కేవలం నాన్-కాగ్నిజబుల్ (ఎన్సీ) ఫిర్యాదు మాత్రమే తీసుకున్నారని బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు.
బాధిత యువకుడి సోదరుడు వృషభ్ పర్మార్ ఈ ఘటన వివరాలను సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. పోలీస్ స్టేషన్‌కు రెండుసార్లు వెళ్లిన తర్వాత గాయపడిన యువకుడినే సీసీటీవీ కెమెరాలను పరిశీలించడానికి పంపారని చెప్పారు. ఆ సమయంలో కుర్లాలోని నాజ్ హోటల్ సమీపంలో నిందితుల్లో ఒకడిని శుభమ్ గుర్తించాడని పేర్కొన్నారు. తన సోదరుడు ప్రాణాలు కోల్పోతే ఎన్సీ సరిపోయేదా అని ప్రశ్నిస్తూ ముంబై పోలీస్ కమిషనర్, మహారాష్ట్ర డీజీపీ, ముఖ్యమంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేశారు.
దాడి చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తించి సరైన సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని, సీసీటీవీ ఫుటేజీని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అదే రోజు మధ్యాహ్నం 4 గంటలకు అదే మాల్ వెనుక ఉన్న ప్రమోద్ మహాజన్ గార్డెన్‌లో కూడా ఒక హిందూ జంటపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని బాధితులు తెలిపారు.