Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

భారత్, జపాన్ సంయుక్తంగా అత్యాధునిక హైపర్‌సోనిక్ క్షిపణి తయారీకి యోచన - India Japan explore joint hypersonic missile development

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), జపాన్‌కు చెందిన ఏటీఎల్ఏ సంస్థలు సంయుక్తంగా సరికొత్త రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు ...

భారత్, జపాన్ సంయుక్తంగా అత్యాధునిక హైపర్‌సోనిక్ క్షిపణి తయారీకి యోచన

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), జపాన్‌కు చెందిన ఏటీఎల్ఏ సంస్థలు సంయుక్తంగా సరికొత్త రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు చర్చలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా ఇరు దేశాల యుద్ధనౌకల నుంచి ప్రయోగించగల అత్యాధునిక హైపర్‌సోనిక్ క్షిపణిని కలిసి తయారు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాయి.

ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే భారత్, జపాన్ కలిసి చేపట్టే తొలి సంయుక్త రక్షణ ప్రాజెక్టుగా ఇది నిలవనుంది. ఈ హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి 1,500 నుంచి 2,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించేలా రూపొందించాలని భావిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందే ఈ వ్యవస్థ చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ కవచాలను సైతం ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ సంప్రదింపులు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నాయి. రాబోయే నెలల్లో మరిన్ని రౌండ్ల చర్చలు జరగనున్నాయి. స్క్రామ్‌జెట్ ఇంజిన్‌తో పనిచేసే హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల సాంకేతికత అత్యంత సున్నితమైనది కావడంతో, దీనికి ఇరు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖలతో పాటు అగ్ర నాయకత్వం అనుమతి అవసరం కానుంది. ప్రస్తుతం డీఆర్డీవో, ఏటీఎల్ఏ రెండూ స్వతంత్రంగా స్క్రామ్‌జెట్ ఇంజిన్లు, ఎయిర్ బ్రీతింగ్ హైపర్‌సోనిక్ క్షిపణులను నేల, నౌకల వేరియంట్ల కోసం అభివృద్ధి చేస్తున్నాయి.

బాహ్య సహాయం లేకుండానే 2035 నాటికి సొంతంగా పనిచేసే క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఇటీవలే జపాన్ తమ టైప్-25 హైపర్‌సోనిక్ గ్లైడర్‌ను భారత పరీక్షా కేంద్రాల నుంచి పరీక్షించేందుకు భారత్ అనుమతించింది. ప్రస్తుతం 900 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ గ్లైడర్ పరిధిని 2030 నాటికి 3,000 కిలోమీటర్లకు పెంచే లక్ష్యంతో ఉన్నారు. సంయుక్త విన్యాసాల వేళ భారత కేంద్రాల నుంచే లైవ్ ఎక్సర్‌సైజ్‌లలో ఆయుధాలను పరీక్షించేందుకు జపాన్‌కు తొలిసారి అవకాశం దక్కింది.