2008 నాటి ముంబై ఉగ్రదాడుల్లో నారిమన్ హౌస్ నుంచి ప్రాణాలతో బయటపడిన ఇజ్రాయెల్ బాలుడు మోషే హోల్జ్‌బర్గ్ ప్రస్తుతం న్యూయార్క్‌లో రబ్బీ విద్యను ...

2008 నాటి ముంబై ఉగ్రదాడుల్లో నారిమన్ హౌస్ నుంచి ప్రాణాలతో బయటపడిన ఇజ్రాయెల్ బాలుడు మోషే హోల్జ్‌బర్గ్ ప్రస్తుతం న్యూయార్క్‌లో రబ్బీ విద్యను అభ్యసిస్తున్నారు. 'బేబీ మోషే'గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, తన తండ్రిలాగే ఆధ్యాత్మిక గురువు మరియు న్యాయ కోవిదుడైన రబ్బీ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
నారిమన్ హౌస్ ఇంఛార్జ్ రబ్బీ ఇజ్రాయెల్ కోజ్లోవ్‌స్కీ రెండు వారాల క్రితం న్యూయార్క్‌లో జరిగిన ఒక సదస్సులో మోషేను కలిశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,000 నుంచి 5,000 మంది రబ్బీలు హాజరైన ఆ సదస్సులో మోషే సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. 26/11 దాడుల సమయంలో రెండేళ్ల వయసులో ఉన్న మోషే ప్రస్తుతం 20 ఏళ్ల యువకుడిగా మారారని కోజ్లోవ్‌స్కీ తెలిపారు. రబ్బీ విద్యను పూర్తి చేసుకున్న తర్వాత మోషే తిరిగి భారత్‌కు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
2008 నవంబర్ 26న పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులు యూదుల కేంద్రమైన చాబాద్ హౌస్‌పై దాడి చేశారు. ఆ దాడిలో మోషే తల్లిదండ్రులైన రబ్బీ గాబ్రియేల్ హోల్జ్‌బర్గ్, రివ్కా హోల్జ్‌బర్గ్ ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో సంరక్షకురాలు శాండ్రా శామ్యూల్ చిన్నారి మోషేను రక్షించి భవనం నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం మోషే ఇజ్రాయెల్ వెళ్లి తన తాతయ్య, అమ్మమ్మల వద్ద పెరిగారు. ఆయన చివరిసారిగా 2018లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి నారిమన్ హౌస్‌ను సందర్శించారు.
ప్రస్తుతం ముంబైలోని నారిమన్ హౌస్ భవనం పునరుద్ధరణ పనుల్లో ఉంది. ఈ ఆరు అంతస్తుల భవనంలో మూడు అంతస్తులను చాబాద్ హౌస్ కార్యకలాపాల కోసం వినియోగించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మిగిలిన మూడు అంతస్తులను ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల స్మారకార్థం మ్యూజియంగా తీర్చిదిద్దుతున్నారు.