కోల్‌కతా: గత మూడు నెలలు నుంచి బెంగాల్ బీజేపీ లోకి ప్రముఖుల చేరికలు ఒక ప్రవాహంలా కొనసాగుతున్నాయి. ఇవాళ ప్రముఖ బెంగాలీ నటి శ్రవంతి బిజెపిల...
కోల్‌కతా: గత మూడు నెలలు నుంచి బెంగాల్ బీజేపీ లోకి ప్రముఖుల చేరికలు ఒక ప్రవాహంలా కొనసాగుతున్నాయి. ఇవాళ ప్రముఖ బెంగాలీ నటి శ్రవంతి బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, కైలాష్ విజయ వర్గీస్ సమక్షంలో శ్రావంతి పార్టీలో చేరారు. ఎన్నికలు దూసుకుపోతున్న తరుణంలో ఈ చేరికలు బీజేపీకి మరింత బలాన్ని ఇవ్వనున్నాయి.
పార్టీలో చేరిన తరువాత ఆమె మాట్లాడుతూ... బెంగాల్‌ను
" బంగారు బెంగాల్" గా మార్చడమే లక్ష్యమని, ఇది పూర్తిగా కొత్త ప్రయాణం అని శ్రవంతి అన్నారు. హిరాన్ ఛటర్జీ, యశ్ దాస్ గుప్తా, పాయల్ సర్కార్, పాపియా అధికారి తర్వాత శ్రవంతి బిజెపిలో చేరారు.
బిజెపిలో చేరిన తరువాత, శ్రావంతి పార్టీ అభ్యర్థి అవుతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని శ్రవంతి అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ తన రోల్ మోడల్ అని, రాష్ట్ర అభివృద్ధి కోసం బిజెపిలో చేరానని శ్రవంతి అన్నారు.