Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

యువకులు పూనుకున్నారు ఆలయం తలుపులు తెరిచారు... అదెక్కడో తెలుసా? - Hinduism - Vandebharath

యువకులు పూనుకున్నారు ఆలయం తలుపులు తెరిచారు... అది వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన శివాలయం అత్యంత మహిమాన్విత శివలింగం ఆ గుడిలో ...

యువకులు పూనుకున్నారు ఆలయం తలుపులు తెరిచారు...

అది వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన శివాలయం అత్యంత మహిమాన్విత శివలింగం ఆ గుడిలో కొలువై వుంది ఒక నాడు నిత్యా పూజలతో అలరాడిన చరిత్ర. కాలక్రమంలో ఆ దేవాలయం దీప ధూప నైవేద్యాలకు నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుంది.

కరినగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామం గుట్టమీది ఉన్న  శివాలయం కాకతీయుల కాలం నాటిదని, చరిత్రకారులు, అక్కడ పెద్దలు చెప్పడం విశేషం. అలాంటి శివాలయంలోని శివలింగానికి  గత కొన్ని సంవత్సరాలుగా పూజలు జరగడం లేదు. ఎవరో ఒకరు, ఎప్పుడో ఒక్కసారి  వెళ్లి  దీపం పెట్టేవారు తప్ప. అటు ప్రభుత్వం కానీ, ఇటు హిందూ సంఘాలు గాని ఆ మహిమాన్విత శివాలయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు.

అయోధ్య రామమందిర నిధి సమర్పణ అభియాన్ తో మారిన " శివాలయం " రూపు రేఖలు....

500 ఏళ్లనాటి హిందువుల కల, 4లక్షల యాభై వేల మంది ప్రాణత్యాగాల ఫలితంగా నేడు అయోధ్యలో సాగుతున్న రామాలయ నిర్మాణానికి దేశంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని భాగస్వామ్యం చెయ్యాలనే లక్ష్యంతో సాగిన నిధి సమర్పణ కార్యక్రమంలో ఆ ఊరి యువకులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆ గ్రామ ప్రజలు రాముల వారికి భక్తి శ్రద్ధలతో నిధిని సమర్పించారు. ఈ కార్యక్రమం ఆ ఊరి యువకులను గ్రామస్తులను ఏకం చేసింది. వారిలో భక్తి భావం పెరిగి
కొండగట్టు మీద శిథిలావస్థలో ఉన్న శివాలయానికి పూర్వవైభవం తీసుకురావాలని పట్టుదలను పెంచింది, ఇక ఆలస్యం చెయ్యకుండా శివాలయానికి మరమ్మత్తులు చేశారు గుడిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
నేడు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు గుడిలో వందలాది మంది భక్తులు భక్తుల మధ్య అత్యంత వైభవంగా శివునికి ఘనంగా అభిషేకాలు. పూజలునిర్వహించారు.

ఆ గ్రామ యువకులు మాట్లాడుతూ ఇలాంటి హిందూ ధార్మిక చైతన్యం ప్రతి గ్రామంలో రావాలని. ధర్మ రక్షణకు, ధర్మ ఆచరణకు ప్రతి హిందూ సోదరుడు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.