Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మోడీ‌ జీ‌ని చూడటం ఆనందం గా ఉందన్న జో బైడెన్ - Vandebharath

భారత్​, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన చతుర్భుజ కూటమి(QUAD) సదస్సు శుక్రవారం సాయంత్రం జరిగింది. వర...


భారత్​, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన చతుర్భుజ కూటమి(QUAD) సదస్సు శుక్రవారం సాయంత్రం జరిగింది. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోడీ,అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్,జపాన్ ప్రధాని యోషిహిది సుగా పాల్గొన్నారు. నాలుగు దేశాల అధినేతలు తొలిసారి ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా, ఆర్థిక సంక్షోభం, ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో అనుసరించాల్సిన వ్యూహం వంటి కీలక అంశాలపై దేశాధినేతలు చర్చించారు.

“మిమ్మల్ని చూడటం చాలా బాగుంది పీఎం మోడీ” అని సదస్సుని ప్రారంభిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. గతేడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్-మోడీ కలవడం ఇదే తొలిసారి. క్వాడ్.. సహకారం కోసం ఒక ముఖ్యమైన వేదికగా ఉంటుందని మరియు వారి(సభ్య దేశాల) యొక్క భవిషత్తులకు ఉచిత మరియు బహిరంగ ఇండో-పసిఫిక్ ప్రాంతం అవసరం అని బైడెన్ తెలిపారు. బెడైన్ మాట్లాడుతూ.. మన కట్టుబాట్లు మాకు తెలుసు … మన ప్రాంతం అంతర్జాతీయ చట్టం ద్వారా పాలించబడుతుంది, అన్ని సార్వత్రిక విలువలకు కట్టుబడి ఉంది మరియు బలవంతం నుండి విముక్తి పొందింది. కానీ మన అవకాశాల గురించి నేను ఆశాజనకంగా ఉన్నాను అని పరోక్షంగా చైనాని ఉదహరణ పేర్కొంటూ మాట్లాడారు. ఇండో ఫసిఫిక్‌ ప్రాంతంలో చైనా మిలటరీ ఆధిపత్యానికి చెక్‌ పెట్టేలాని పరోక్షంగా బైడెన్ అన్నారు. క్వాడ్​ దేశాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని బైడెన్ తెలిపారు. ఈ నాలుగు దేశాల కూటమికి చాలా ప్రాముఖ్యత ఉందని..ఈ కూటమి ఎలాంటి సమస్య ఎదురైనా ఆచరణాత్మక పరిష్కారాలు వెతుకుతుందని తెలిపారు.

ప్రధాని మోడీ మాట్లాడుతూ.. స్నేహితుల మధ్య ఉండటం బాగుంది. ఈ ప్రయత్నానికి పూనుకున్న అధ్యక్షుడు బైడెన్‌కు నా కృతజ్ఞతలు. నాలుగు దేశాలు(భారత్,అమెరికా,జపాన్,ఆస్ట్రేలియా) తమ ప్రజాస్వామ్య విలువలతో ఐక్యమయ్యాయి. ఉచిత, బహిరంగ మరియు సమగ్ర ఇండో-పసిఫిక్ పట్ల నిబద్ధత కలిగి ఉన్నాం. ఈ రోజు మన ఎజెండా – టీకాలు, వాతావరణ మార్పు మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటిని కవర్ చేయడం క్వాడ్ ని..ప్రపంచ మంచి కోసం శక్తిగా మారుస్తుంది. ప్రపంచాన్ని ఒకే కుటుంబంలా భావించే వసుదైవ కుటుంబకం అనే పురాతన భారతీయ ఫిలాసపీని నమ్ముతా. మన భాగస్వామ్య విలువలను అభివృద్ధి చేయడానికి మరియు సురక్షితమైన, స్థిరమైన మరియు సంపన్నమైన ఇండో- పసిఫిక్ ప్రాంతాల అభివృద్ధికి నాలుగు దేశాలతో మరింత దగ్గరగా కలిసి పనిచేసేందుకు భారత్​ సిద్ధంగా ఉంది. క్వాడ్.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వానికి ఒక ముఖ్యమైన స్తంభంగా మిగిలిపోతుందని మోడీ అన్నారు.

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మాట్లాడుతూ..ఇండో-పసిఫిక్​.. 21వ శతాబ్దంలో ప్రపంచదేశాల గతిని మార్చేస్తుంది. నాలుగు గొప్ప ప్రజాస్వామ్యదేశాల నాయకులు శాంతి, స్థిరత్వం, దేశాల శ్రేయస్సు కోసం కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

మరోవైపు, క్వాడ్ సదస్సుపై చైనా తీవ్రంగా స్పందించింది. ఇవాళ ఉదయం చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియన్ మాట్లాడుతూ..దేశాల మధ్య చర్చలు, సహకారం.. మూడో వ్యక్తుల(దేశాల) ఆశయాలను దెబ్బతీయడానికి కాక పరస్పర అవగాహన, విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు జరగాలి. ఒక దేశాన్ని నష్ట పరిచేందుకు ప్రత్యేక కూటమి ఏర్పాటు చేయరాదు. సంబంధిత దేశాలు(క్వాడ్).. పారదర్శకత, సమ్మిళిత, ఇరువురికీ లాభం అనే సూత్రాలను పాటిస్తాయని విశ్వసిస్తున్నాం. శాంతి, సుస్థిరత, అభివృద్ధి సాధన కోసం చర్చలు జరగాలని పేర్కొన్నారు.

క్వాడ్.. 2007 లో ఏర్పాటు చేసిన యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా మరియు భారతదేశం యొక్క అనధికారిక వ్యూహాత్మక వేదిక. ఇది చైనాకి వ్యతిరేకంగా 2017 లో పునరుద్ధరించబడింది. ఇటీవలి సంవత్సరాలలో చైనాతో విభేదాలు ఉన్న నాలుగు దేశాలకు క్వాడ్ బలమైన దృష్టిగా ఉంది. నవంబర్‌లో, క్వాడ్ దేశాలు కలిసి బెంగాల్ బే మరియు అరేబియా సముద్రంలో మలబార్ 2020 అనే రెండు దశల ఉమ్మడి సైనిక విన్యాసంలో పాల్గొన్నాయి.