హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైయస్‌ఆర్ అభిమానులతో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సమావేశమయ్యారు. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు...
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైయస్‌ఆర్ అభిమానులతో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సమావేశమయ్యారు. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నదే నా ఆకాంక్ష. స్థానిక సమస్యలు, టీఆర్‌ఎస్ పాలనపై చర్చించాం. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వైఎస్సార్ సేవ చేశారని చెప్పారు.
తెలుగు ప్రజలు అందరినీ వైఎస్సార్ ప్రేమించారు. రైతు రాజు కావాలని, పేదవాడు లక్షాధికారి కావాలనుకున్నారు. పేద విద్యార్థి ఉచితంగా పెద్దచదువులు చదువుకోవాలని వైఎస్ ఆశించారు. పేదవాడికి అనారోగ్యమైతే భరోసాగా వైఎస్ నిలవాలనుకున్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వైఎస్సార్ సేవ చేశారని షర్మిల అన్నారు.
తెలుగు ప్రజలనందరినీ వైఎస్సార్ ప్రేమించారు. ప్రతి రైతు రాజు కావాలనుకున్నడు వైఎస్సార్. ప్రతి పేదవాడు లక్షాధికారి కావాలనుకున్నాడు. ప్రతి పేద విద్యార్థి ఉచితంగా పెద్ద చదువులు చదువుకోవాలని వైఎస్ ఆశించారు. ప్రతి పేదవాడికి అనారోగ్యం చేస్తే భరోసాగా నిలవాలని వైఎస్ భావించారు’’ అని షర్మిల గుర్తుచేశారు. తెలంగాణలో వైయస్సార్ ఆశయాలు సాధించేందుకు ఆయన అభిమానులంతా ముందుకు కదలాలని షర్మిల ఆకాంక్షించారు.