పె ట్రోల్, డీజిల్‌పై అగ్రి ఇన్‌ఫ్రా సెస్ విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. పెట్రోల్‌పై రూ.2.50, ...
పెట్రోల్, డీజిల్‌పై అగ్రి ఇన్‌ఫ్రా సెస్ విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్‌పై రూ.4 అగ్రి ఇన్‌ఫ్రా సెస్ విధించనున్నట్టు ప్రకటించారు. దీంతో ఇంధన ధరలపై మరింత భారం పడనుందని పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ క్లారిటీ ఇచ్చారు.
పెట్రోల్, డీజిల్‌పై అగ్రి ఇన్‌ఫ్రా సెస్ విధించినప్పటికీ కస్టమర్లపై ఎలాంటి అదనపు భారం పడదని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇతర పన్నులు తగ్గించామని ఆమె వివరించారు. వాటిపై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీలు తగ్గించినట్లు తెలిపారు. ప్రజలపై ఎలాంటి భారం పడకుండానే కొత్తగా అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్సును తీసుకొచ్చినట్లు చెప్పారు.
మరోవైపు.. మద్యం ఉత్పత్తులపై 100 శాతం, ముడి పామాయిల్‌పై 17.5 శాతం, సోయాబీన్, పొద్దు తిరుగుడు ముడి నూనెపై 20 శాతం, యాపిల్‌పై 35 శాతం, బంగారం, వెండిపై 2.5 శాతం, బఠానీలపై 40 శాతం, కాబూలీ శనగలపై 30 శాతం, శనగలపై 50 శాతం, పత్తిపై 5 శాతం అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ను విధించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘కరోనా వేళ వైద్య పరీక్షలకు సౌకర్యాలు లేక ఇబ్బంది పడ్డాం. అందుకే ఈసారి వైద్య రంగానికి బడ్జెట్‌లో గతేడాది కంటే 137 శాతం ఎక్కువ నిధులు కేటాయించాం. దీంతో పాటు రహదారులు, వంతెనలు, విద్యుదుత్పత్తి, ఓడరేవులుపై అధికంగా ఖర్చు చేస్తాం’ అని ఆమె తెలిపారు.