Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

లక్ష కోట్ల మొక్కలను నాటగలవు! Vandebharath

  రోజురోజుకూ అడవులు అంతరించిపోతున్నాయి. పర్యావరణంలో కాలుష్యం పెరిగిపోతోంది. ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. దీనిపై పర్యావర...

 


రోజురోజుకూ అడవులు అంతరించిపోతున్నాయి. పర్యావరణంలో కాలుష్యం పెరిగిపోతోంది. ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. దీనిపై పర్యావరణ పరిరక్షకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరిగిపోతున్న అటవీ సంపదను మళ్లీ పున:సృష్టించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అప్పుడే వాతావరణంలో మార్పులను నెమ్మదిగా నివారించవచ్చునని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అడవులను పున:నిర్మించే కొత్త రోబో ఫారెస్టర్ అవసరం ఎంతో ఉందంటున్నారు. అడవులను తిరిగి సృష్టించడం కోసం రోబో ఫారెస్టర్ అనే వెహికల్ ను డెవలప్ చేశారు.

ఈ రోబో ఫారెస్టర్ సాయంతో లక్ష కోట్ల చెట్లను నాటవచ్చునని చెబుతున్నారు. ఆరు గంటల్లో రెండున్నర ఎకరాల మొక్కలను నాటగల సామర్థ్యం రోబోలకు ఉంది. మిల్రెమ్ రోబాటిక్స్ అనే ఎస్టోనియన్ కంపెనీ ఈ తరహా అటోనమస్ ట్యాంకులతో రోబోలను డెవలప్ చేశారు. వీటి సాయంతో కొత్త అడవులను సృష్టించవచ్చు. ఈ కొత్త రోబో ప్లాంటర్ రెండున్నర ఎకరాల విస్తీర్ణం గల అడవిలో 300 వరకు మొక్కలను కేవలం ఆరు గంటల్లో నాటగలదు. వాస్తవానికి రోబో ఫారెస్టర్.. ప్రధానంగా వాణిజ్య అడవుల కోసం రూపొందించగా.. సహజ సిద్ధమైన అడవులను కూడా పున:నిర్మించగలవని రోబో డెవలపర్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో అడవులు అంతరించిపోవడానికి 15శాతం గ్రీన్ హౌస్ గౌస్ ప్రభావం చూపుతోంది.

ప్రతి ఏడాదిలో వ్యవసాయపరంగా ఇతర కార్యాకలాపాలతో 10 మిలియన్ల హెక్టార్ల మొక్కలను నరికివేస్తున్నారని పర్యావరణ పరిరక్షకులు చెబుతున్నారు. అందుకే మళ్లీ అడవులను పున: నిర్మించేందుకు ఒక ట్రిలియన్.. లక్ష కోట్ల మొక్కలను నాటాల్సి ఉందని అంటున్నారు. ఈ తరహా విధానం ద్వారా నెమ్మదిగా వాతావరణంలో మార్పులను తగ్గించవచ్చునని అభిప్రాయపడుతున్నారు. ఒక చెట్టు తన జీవితకాలంలో సగటున 0.62 మెట్రిక్ టన్నుల కార్బన్ డైయాక్సైడ్‌ను పీల్చుకోగలదు.


2,400 కిలోమీటర్లు ప్రయాణించే ఒక కారులో నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలతో సమానంగా ఉంటుంది. అయితే చెట్లను నాటడం ద్వారా పర్యావరణంలో కలిగే పెనుమార్పులను తగ్గించవచ్చునని సైంటిస్టులు చెబుతున్నారు. అది కూడా చెట్లను ఎక్కడపడితే అక్కడ నాటితే సరిపోదని, సరైన ప్రదేశంలో సరైన చెట్లను నాటినప్పుడే పర్యావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని నిర్మూలించడం సాధ్యపడుతుందని సైంటస్టులు సూచిస్తున్నారు.