Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

గాల్వన్‌ ఘర్షణ వీడియో విడుదల చేసిన చైనా - Vandebharath

  బీజింగ్‌: చైనా, భారత్‌ సరిహద్దు ప్రాంతమైన తూర్పు లఢక్‌లోని గాల్వన్‌ లోయ వద్ద గత ఏడాది జూన్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ వీడియోను...

 


బీజింగ్‌: చైనా, భారత్‌ సరిహద్దు ప్రాంతమైన తూర్పు లఢక్‌లోని గాల్వన్‌ లోయ వద్ద గత ఏడాది జూన్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ వీడియోను చైనా శుక్రవారం విడుదల చేసింది. ఈ ఘర్షణలో నలుగురు పీఎల్‌ఏ అధికారులతోపాటు పలువురు మరణించినట్లు ఈ ఉదయం ఆ దేశ సైనిక అధికారి ఒకరు అధికారికంగా అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఈ ఘర్షణకు సంబంధించిన ఒక వీడియోను ఆ దేశ సైన్యం విడుదల చేయగా చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్ తన ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

భారత సైన్యమే ఈ ఘర్షణకు దిగినట్లు ఆ వీడియోలో చైనా ఆరోపించింది. ఎల్‌ఏసీని అతిక్రమించి తమ సైనికులపై దాడి చేసి హింసకు పాల్పడ్డారని పేర్కొంది. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు మరణించడంతోపాటు గాయపడినట్లు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రెన్ గుయోకియాంగ్ వెల్లడించారు.

లోకల్ టు గ్లోబల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.