ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ పరాజయంతో తర్వాత భారత్ పుంజుకుంది. విజయమే లక్ష్యంగా రెండో టెస్ట్‌ను ప్రారంభించిన భారత్ తొలి నుంచి దూకుడుతో దూసుకెళ...
ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ పరాజయంతో తర్వాత భారత్ పుంజుకుంది. విజయమే లక్ష్యంగా రెండో టెస్ట్‌ను ప్రారంభించిన భారత్ తొలి నుంచి దూకుడుతో దూసుకెళ్లింది. ఓ వైపు భారత బ్యాట్స్‌మెన్ 329 పరుగులతో రాణించగా.. బౌలర్లు కూడా రెచ్చిపోయారు.
భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్ విలవిలలాడిపోయారు. 59.5 ఓవర్లలో కేవలం 134 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లాండ్ కుప్పకూలింది. దీంతో భారత్ 195 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నిలకడగా మ్యాచ్ ప్రారంభించింది. 1.2 ఓవర్ల వద్ద భారత్ గిల్ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. ఇక రెండో రోజు ఆట ముగిసే సమాయానికి 18 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయిన భారత్ 54 పరుగుుల చేసింది. ఆట ముగిసే సమయానికి క్రీజులో పుజారా ( 7), రోహిత్ (25) ఉన్నారు. ఇక మూడో రోజు ఆటను భారత బ్యాట్స్ మెన్ ప్రారంభించారు.