గద్వాల : ఆ యువకుడి చిన్నపాటి నిర్లక్ష్యం.. అతని ప్రాణాన్నే బలిగొనేలా చేసింది. చెవిలో ఇయర్‌ఫోన్స్‌తో రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా.....
గద్వాల : ఆ యువకుడి చిన్నపాటి నిర్లక్ష్యం.. అతని ప్రాణాన్నే బలిగొనేలా చేసింది. చెవిలో ఇయర్‌ఫోన్స్‌తో రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా.. రైలు ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని వెంకమ్‌పేట శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. వెంకమ్‌పేటకి చెందిన పేతురు రాజు (24) శుక్రవరాం సాయంత్రం మొబైల్‌కు హేడ్‌సెట్ కనెక్ట్ చేసి పాటలు వీంటూ గ్రామ శివారులోని రైలు పట్టాలపై వెళ్తున్నాడు. గద్వాల నుంచి హైద్రాబాద్ వైపు వెళ్తున్న రైలు డ్రైవర్.. పట్టాలపై వెళ్తున్న రాజుని గమనించి హారన్ మోగించినప్పటికి అతను అప్రమత్తం కాలేదు. ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు యువకుడిని 108లో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి సుదర్శనం ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.