ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో టీం ఇండియా పట్టుబిగిస్తోన్నట్లే కనిపిస్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సరికి 99 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పో...
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో టీం ఇండియా పట్టుబిగిస్తోన్నట్లే కనిపిస్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సరికి 99 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది టీం ఇండియా. ఓపెనర్‌గా దిగిన రోహిత్ శర్మ 57 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. అయితే.. మరో ఓపెనర్ గిల్ 11 పరుగులు, టెస్టు స్పెషలిస్టు పుజారా డకౌట్ అయ్యాడు. అలాగే విరాట్ కోహ్లి 27 పరుగులు చేసి లీచ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి రోజు ఆటముగిసే సరికి క్రీజులో రోహిత్ శర్మ, రహానే (1) ఉన్నారు. కాగా.. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్‌ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు క్రీజులో నిలువలేక వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ జాక్ క్రాలే 53 పరుగులతో రాణించినా.. డొమినిక్ సిబ్లే , జానీ బెయిర్ స్టోలు డకౌట్ కాగా.. కెప్టన్ జోరూట్ 17, బెన్ స్టోక్స్ 6, ఒలీ పోప్ 1, జాక్ లీచ్ 3, అర్చర్ 11, బెన్ ఫోక్స్ 12, బ్రాడ్ 3 పరుగులే చేసి ఘోరంగా ఫెయిలయ్యారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 48.4 ఓవర్లలో 112 పరుగులకే చాప చుట్టేసింది.