Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మొబైల్‌ గేమ్‌ ఆడటం ద్వారా అంతరించిపోతున్న జాతులను కాపాడొచ్చు! - Vandebharath

  ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. జీవ జాతులకు అత్యవసర సహాయం అందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే వాటి మనుగడ అంతర...

 


ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. జీవ జాతులకు అత్యవసర సహాయం అందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే వాటి మనుగడ అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసిఎన్) నివేదిక ప్రకారం 35,500పైగా జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో గేమ్‌ ఆడటం ద్వారా వాటి పరిరక్షణకు తోడ్పడే అవకాశం కూడా ఉన్నది. ఆ యాప్‌ పేరే వైల్డ్‌చైన్‌. గేమ్‌లో డబ్బులను ఖర్చు చేయడం అంటే గుడ్లు అమ్మడం, ఐచ్ఛిక ప్రకటనలు, ఆటలోని వస్తువులను అమ్మడం వంటి వాటి ద్వారా వన్యప్రాణుల రక్షణ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వొచ్చు.

ఒక క్రీడాకారుడు ఆటలో ఒక చెట్టును నాటితే, స్వచ్ఛంద సంస్థ వాస్తవ ప్రపంచంలో ఒక మొక్కను నాటుతుంది. పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతునివ్వడానికి వ్యక్తులు, సంస్థలకు స్ఫూర్తి, శక్తినిచ్చే ఉద్యమాన్ని ప్రారంభించాలనేదే వైల్డ్‌చైన్‌ ప్రథమ లక్ష్యం. ఈ మొబైల్ గేమ్ ఆడటం ద్వారా అంతరించిపోతున్న జాతులను కాపాడటానికి మీరు సహాయపడవచ్చు.