Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

బాప్టిజం ఇచ్చిన కొన్ని గంటలకే ఆ బాలిక మృతి - Vandebharath

రొమేనియాలో ఓ ఆరు వారాల చిన్నారిని మూడు సార్లు నీటిలో ముంచి బాప్టిజం ఇచ్చిన కొన్ని గంటలకే ఆ బాలిక మరణించడం కలకలం రేపుతోంది. మున్ముందు ఇలాంటి ...


రొమేనియాలో ఓ ఆరు వారాల చిన్నారిని మూడు సార్లు నీటిలో ముంచి బాప్టిజం ఇచ్చిన కొన్ని గంటలకే ఆ బాలిక మరణించడం కలకలం రేపుతోంది.

మున్ముందు ఇలాంటి విషాదాలు జరగకుండా నిరోధించటానికి ఇలాంటి ఆచారాలను సమీక్షించి మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థొడాక్స్ ఆర్చ్‌బిషప్ కాలినిక్ పేర్కొన్నారు.

ఆరు వారాల వయసున్న బాలుడిని క్రైస్తవ మత ఆచారం ప్రకారం బాప్టిజం ఇవ్వడానికి మూడు సార్లు 'పవిత్ర జలం'లో ముంచారు.

ఆ తర్వాత ఆ బాలుడు కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయాడు.

అతడి ఊపిరితిత్తుల్లో నీరు ఉన్నట్లు శవపరీక్షలో గుర్తించారు.

ఈ ఆచారాన్ని మార్చాలని కోరుతూ ప్రారంభించిన ఒక ఆన్‌లైన్ పిటిషన్ మీద సుమారు 60,000 మంది సంతకం చేశారు.

దీనికి ఆర్చిబిషన్ కాలినిక్ మద్దతు తెలిపారు.

భవిష్యత్తులో శిశువును నీటిలో ముంచి బాప్టిజం ఇచ్చే ఆచారాన్ని సమీక్షించి.. ఇటువంటి అవాంఛిత ప్రమాదాలు జరగకుండా నిరోధించటానికి చర్చి ఆదేశాలను గౌరవించేలా తగిన నిర్ణయం తీసుకుంటారని తాను విశ్వసిస్తున్నట్లు ఆయన ఒక రొమేనియా వెబ్‌సైట్‌తో చెప్పారు.

రొమేనియాలోని ఈశాన్య నగరం సుసీవాలో ఆ చిన్నారికి బాప్టిజం ఇచ్చిన మతాధికారి మీద హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఈ చిన్నారి మరణంతో బాప్టిజం ఇచ్చే విధానంలో మార్పులు వచ్చినట్లయితే.. అది రొమేనియా ఆర్థొడాక్స్ చర్చితో వివాదానికి దారితీస్తుందని రొమేనియా బీబీసీ ప్రతినిధి స్టీఫెన్ మెక్‌గ్రాత్ పేర్కొన్నారు.

చర్చి ప్రముఖులు కొందరు మార్పుకు సానుకూలంగా ఉన్నట్లు సూచించినప్పటికీ.. చిన్నారి తలను నీటిలో ముంచే ప్రాచీన బాప్టిజం ఆచారాన్ని కొనసాగించాలనే మిగతావారు స్పష్టంగా కోరుతున్నారు.

మార్పుకు సంసిద్ధంగా ఉన్నట్లు కనిపించిన వారిలో అత్యంత ప్రముఖులు ఆర్జెస్ ఆర్చిబిషప్ ఎమినెన్స్ కాలినిక్.

''కొన్ని ప్రఖ్యాత వివరణల్లో.. జీసస్ మెడ వరకూ లోతున్న నీటిలో నిల్చుని తల వంచి ఉండగా.. ఆయన తల మీద నీటిని పోసి బాప్టిజం ఇచ్చినట్లు కనిపిస్తుంది'' అని ఆయన ప్రస్తావించారు.

అయితే.. టోమిస్ ఆర్చిబిషప్ మాత్రం ఈ ఆచారాన్ని మార్చే ప్రసక్తే లేదంటున్నారు.

''ఈ ఆచారాన్ని మేం ఎన్నడూ మార్చబోం. ఈ మత నియమనిబంధనలు వెయ్యేళ్లకు పైగా అమలులో ఉన్నాయి. కాబట్టి వాటిని మేం మార్చబోం. మేం భయపడేది లేదు'' అని ఆయన స్పష్టం చేశారు.

రొమేనియాలో శక్తిమంతమైన ఆర్థొడాక్స్ చర్చి సంస్కరణలకు చోటివ్వదని పేరుపడింది. కానీ తాజా బాప్టిజం విషాదం.. మార్పు వైపు దారితీయవచ్చు.

ఆర్చిబిషప్ ఎమినెన్స్ కాలినిక్ ఇటీవలే.. మాజీ యువరాజు నికొలస్ ఆఫ్ రొమేనియా కుమార్తెకు ఇటీవలే బాప్టిజం ఇచ్చారు.

నీటిలో పూర్తిగా ముంచి బాప్టిజం ఇవ్వటం పెద్దలకు సరిపోతుందని.. అయితే బాప్తిజం ఇవ్వటానికి ఇతర పద్ధతులు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

కొన్ని సంవత్సరాల కిందట ఆయన ట్రాన్సిల్వేనియాలో మతాధికారిగా ఉన్నపుడు.. చిన్నారికి బాప్టిజం ఇవ్వటానికి ఆ చిన్నారి పాదాలను నీటిలో ముంచి, చిన్నారి తల మీద నీటిని చిలకరించాలని చెప్పారు.

బాప్టిజం ఇచ్చేటపుడు ప్రమాదాలను నివారించటానికి ఆ ప్రక్రియ మీద పర్యవేక్షణ ఉండాలని.. నీటిలో తల ముంచే విధానాన్ని మార్చాలని కోరుతూ పిటిషన్ ప్రారంభించిన వ్లాదిమిర్ దుమిట్రు పేర్కొన్నారు.

రొమేనియా ఆర్థొడాక్స్ చర్చికి చాలా గౌరవం ఉంది. అయితే.. కరోనావైరస్ మహమ్మారి విషయంలో చర్చి వ్యవహారశైలిపై ఇప్పటికే విమర్శలు వచ్చాయి.

గత ఏడాది మార్చిలో దేశమంతా లాక్‌డౌన్ విధిస్తున్న సమయంలో క్లజ్ నగరంలోని మతగురువులు ప్రార్థనకు హాజరైన భక్తులందరికీ ఒకే స్పూను ఉపయోగించాలని సూచించారు. అది విమర్శలకు దారి తీసింది.