అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ప్రపంచంలోని ధనిక దేశాలకు ఓ పిలుపు ఇచ్చారు. ఇక నుంచి మనమందరం 100శాతం సింథటిక్ బీఫ్(ల్యాబ్ లో ...
అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ప్రపంచంలోని ధనిక దేశాలకు ఓ పిలుపు ఇచ్చారు. ఇక నుంచి మనమందరం 100శాతం సింథటిక్ బీఫ్(ల్యాబ్ లో తయారు చేసిన గొడ్డు మాంసం) తినడం ప్రారంభించాలని బిల్స్ గేట్స్ చెప్పారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో సహాయపడటానికి సంపన్న దేశాలు ఈ పని చేయక తప్పదని గేట్స్ స్పష్టం చేశారు. గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించడానికి ఏం చేయాలనే అంశంపై ఎంఐటీ టెక్నాలజీ రివ్యూవ్ ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ తన ఐడియాలను పంచుకున్నారు.
”అన్ని ధనిక దేశాలు 100శాతం సింథటిక్ గొడ్డు మాంసం వైపుకు వెళ్లాలని నేను అనుకుంటున్నా” అని మీథేన్ ఉద్గారాలను ఎలా తగ్గించాలో అడిగినప్పుడు గేట్స్ చెప్పారు. “మీరు రుచి వ్యత్యాసానికి అలవాటుపడొచ్చు. కాలక్రమేణా దాన్ని మరింత రుచిగా చూడబోతున్నారు. చివరికి, ఆ ఆకుపచ్చ ప్రీమియం నిరాడంబరంగా ఉంటుంది” అని బిల్ గేట్స్ అన్నారు. బిల్ గేట్స్ రాసిన పుస్తకం “వాతావరణ విపత్తును ఎలా నివారించాలి-How to avoid a Climate Disaster” ఇటీవల మార్కెట్ లోకి వచ్చింది.