Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

చుక్క లిక్కర్ తాగకుండానే..మత్తులో - Vandebharath

US woman :   మద్యం తాగే వారు మత్తులో ఉంటారు. మత్తులో తూగుతూ ఉంటారు. కిక్ ఎక్కడం కోసం..ఎక్కువగానే మద్యాన్ని సేవిస్తుంటారు. లిక్కర్ సేవించిన త...


US woman : మద్యం తాగే వారు మత్తులో ఉంటారు. మత్తులో తూగుతూ ఉంటారు. కిక్ ఎక్కడం కోసం..ఎక్కువగానే మద్యాన్ని సేవిస్తుంటారు. లిక్కర్ సేవించిన తర్వాత..మత్తులో ఉంటారనే సంగతి అందరికీ తెలిసిందే. మద్యం తాగి..డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతుంటారు. అయితే..ఓ మహిళకు మద్యం తాగే అలావాటే లేదు. కానీ..మత్తులో ఉంటోంది. చుక్క లిక్కర్ తాగకుండానే..మత్తులో అటూ ఇటూ..తిరుగుతోంది. కేవలం ఒకరోజు కాదు..ప్రతి రోజు ఆ మహిళకు ఫుల్ కిక్కులో ఉంటోంది. చిన్నప్పటి నుంచి మద్యం తాగే అలవాటే లేదని చెబుతోంది.

అమెరికాకు చెందిన సారా అనే మహిళ ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా ఎన్నోసార్లు దొరికింది. చివరకు చేసేది ఏమీ లేక..వైద్యులను సంప్రదించింది. ఆమెను క్షుణ్ణంగా పరీక్షించారు. చివరకు ఆమె ఆటో బ్రేవరీ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధ పడుతున్నట్లు నిర్ధారించారు. కడుపులో ఉన్న ఈస్ట్ ఫంగస్ మిథనాల్ గా మారి రక్తంలో కలిసి పోతోందని, దీంతో మద్యం తాగకపోయినా..మత్తలో ఉండడం జరుగుతోందని వెల్లడించారు. దీని ద్వారా..తాగిన వాళ్ల లాగా..ప్రవర్తిస్తోందని, దీనికి పరిష్కారం కాలేయ మార్పిడి ఒక్కటేనని వైద్యులు తెలిపారు.