Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

అరుణ గ్రహంపై ఎగరనున్న హెలికాప్టర్‌ - Vandebharath

  టెక్సాస్‌: మార్స్ గ్రహంపైకి నాసా పంపిన స్పేస్‌క్రాఫ్ట్ గురువారం చేరుకోనున్నది. అయితే ఆ వ్యోమనౌకలో ఈ సారి ఓ చిన్నపాటి హెలికాప్టర్‌ను కూడా ప...

 


టెక్సాస్‌: మార్స్ గ్రహంపైకి నాసా పంపిన స్పేస్‌క్రాఫ్ట్ గురువారం చేరుకోనున్నది. అయితే ఆ వ్యోమనౌకలో ఈ సారి ఓ చిన్నపాటి హెలికాప్టర్‌ను కూడా పంపుతున్నారు. మార్స్ గ్రహంపై తొలిసారి హెలికాప్టర్‌ను ఎగురవేయాలని నాసా భావిస్తున్నది. దానికి ఇన్‌జెన్యూటి అని పేరు పెట్టారు. భూమిపైన వందేళ్ల క్రితం విమానాలు ఎగరగా.. ఇప్పుడు అంగారక గ్రహంపై విమానాలు ఎగరనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతి తక్కువ బరువుతో ఆ హెలికాప్టర్‌ను తయారు చేశారు. వాస్తవానికి ఇది మినీ డ్రోన్ తరహాలో ఉంటుంది. దీని బరువు కేవలం నాలుగు పౌండ్లే. అంటే 1.8 కిలోగ్రాములు. ఆ హెలికాప్టర్ బ్లేడ్లు పెద్దగా ఉన్నాయి. అయిదు రేట్లు అధిక వేగంతో తిరగనున్నాయి. నిమిషానికి 2400 సార్లు ఆ బ్లేడ్లు తిరుగుతాయట.

ఇన్‌జెన్యూటీకి నాలుగు కాళ్లు ఉన్నాయి. బాక్సు తరహాలో దాని బాడీ ఉంటుంది. రెండు రూటర్లు అపోజిట్ డైరక్షన్‌లో తిరుగుతుంటాయి. వాటికి నాలుగు కార్బన్ ఫైబర్ బ్లేడ్లు అమర్చారు. రెండు కెమెరాలు, కంప్యూటర్లు, నేవీగేషన్ సెన్సార్లు ఉన్నాయి. అతిశీతలంగా ఉండే మార్స్ గ్రహంపై వేడి కోసం ఆ హెలికాప్టర్‌కు సోలార్ సెల్స్‌ను అమర్చారు. వాటితో బ్యాటరీలు రీచార్జ్ అవుతాయి. పర్సీవరెన్స్ రోవర్‌తో పాటు ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ .. మార్స్ గ్రహంపై దిగనున్నది. ఒక నెల రోజుల సమయంలో అయిదుసార్లు ఆ హెలికాప్టర్ చక్కర్లు కొట్టే అవకాశం ఉన్నది. సుమారు 3 నుంచి 5 మీటర్ల ఎత్తులో ఆ హెలికాప్టర్ ప్రయాణించనున్నది. దాదాపు 50 మీటర్ల దూరం అది వెళ్లగలదు. ఒక్కొక్క ఫ్లయిట్ కనీసం 90 సెకన్లు ఉంటుంది. సాంకేతిక ప్రదర్శనలో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నది. కొత్త సామర్థ్యాలను అంగారక వాతావరణంపై పరీక్షించడమే దీని ఉద్దేశం.