Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

రష్మి సామంత్‌ రాజీనామా - Vandebharath

  లండన్: ఆక్స్‌ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ (ఎస్యూ) అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన రష్మి సామంత్ అధ్యక్ష పదవికి రాజీ...

 

లండన్: ఆక్స్‌ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ (ఎస్యూ) అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన రష్మి సామంత్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అధ్యక్ష పదవికి ఎన్నిక కాక ముందు చేసిన వ్యాఖ్యలు, సూచనల వివాదాల మధ్య ఈ పదవికి రష్మి సామంత్‌ రాజీనామా చేశారు. సామంత్‌ సోషల్ మీడియాలో చేసిన పలు పోస్టులు జాత్యహంకారమైనవిగా, అతిసున్నితమైనవిగా విమర్శలు ఎదుర్కొన్నాయి.

వీటిలో 2017 లో జర్మనీలోని బెర్లిన్ హోలోకాస్ట్ మెమోరియల్ సందర్శించినప్పుడు ఒక పోస్ట్‌పై హోలోకాస్ట్ రిఫరెన్స్ తోపాటు మలేషియాలో చిత్రీకరించిన ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్ "చింగ్ చాంగ్"ను చదివిన చైనా విద్యార్థులను ఎంతగానో కలవరపరిచిందని విమర్శలు ఉన్నాయి.

ఈ వారం ప్రారంభంలో విద్యార్థి వార్తాపత్రిక 'చెర్వెల్' లో ప్రచురించిన బహిరంగ లేఖలో రష్మి సామంత్ రాజీనామా చేయడానికి గల కారణాలను వెలిబుచ్చారు ఇటీవలి పరిణామాల పట్ల క్షమాపణలు చెప్తున్నానని, తన మ్యానిఫెస్టోపై నమ్మకం ఉంచి ఓట్లువేసి అధ్యక్ష పదవికి ఎన్నుకున్న విద్యార్థుల నమ్మకాన్ని వమ్ము చేసేలా ప్రవర్తించినందుకు బాధగా ఉన్నదని పేర్కొన్నారు. అద్భుతమైన విద్యార్థి సమాజానికి దూరమవుతున్నందుకు విచారిస్తున్నట్లు తెలిపారు. నా చర్యలతో, మాటలతో బాధపడుతన్న ప్రతి విద్యార్థికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించింది. మీ నమ్మకాన్ని మళ్లీ పొందే అవకాశాన్ని కోరుతున్నట్లు తన లేఖలో తెలిపారు.

తనపై ఒత్తిడి పెరుగుతుండటంతో తప్పని పరిస్థితుల్లో అధ్యక్ష పదవికి రష్మి సామంత రాజీనామా చేయాల్సి వచ్చిందని పలువురు తోటి విద్యార్థులు చెప్తున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ విద్యా సంస్థలో జాత్యహంకారం, ట్రాన్స్‌ఫోబియా, యాంటిసెమిటిజానికి స్థానం లేదని ఆ విశ్వవిద్యాలయం ప్రకటనలో పేర్కొన్నది. రష్మి రాజీనామా కారణంగా మళ్లీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటకలోని ఉడుపి ప్రాంతానికి చెందిన రష్మి సామంత్‌.. తల్లిదండ్రులతో కలిసి లండన్‌ వెళ్లి అక్కడే సెటిలైంది.