ప్రముఖ బిజినెస్ మ్యాన్, రిలయన్స్ సంస్థల అధిపతి ముఖేష్ అంబానీలో మరో కోణం ఉంది. అదే జంతువుల పట్ల అమిత ప్రేమ. అందుకే ఈ ప్రపంచ కుబేరుడు ఇప్ప...
ప్రముఖ బిజినెస్ మ్యాన్, రిలయన్స్ సంస్థల అధిపతి ముఖేష్ అంబానీలో మరో కోణం ఉంది. అదే జంతువుల పట్ల అమిత ప్రేమ. అందుకే ఈ ప్రపంచ కుబేరుడు ఇప్పుడు జూ స్టార్ట్ చేసే పనిలో పడ్డారు. అవును మీరు వింటున్నది నిజం. జంతు ప్రదర్శనశాల ఏర్పాటుపై ముఖేష్ తాజాగా తన దృష్టినంతా కేంద్రీకరిస్తున్నారని వార్తలొస్తున్నాయి.
కమ్యూనికేషన్స్, రీటైల్, డిజిటల్ రంగాలలో పోటీ లేకుండా అప్రతిహతంగా దూసుకుపోతున్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, జూ ప్రారంభం విషయం గురించి యోచిస్తున్నారు. ఆలోచన వచ్చిన వెంటనే జూ నిర్మాణానికి స్థలం సేకరించడం మొదలుపెట్టారట. జూ నిర్మాణం అద్భుతంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారని వార్తలొస్తున్నాయి.
ఈ జూ గుజరాత్‌లో ఏర్పాటు కాబోతోందట. రిలయన్స్ జూ పేరు ప్రపంచం మొత్తం మారుమ్రోగేలా డిజైన్ చేస్తున్నారట . వరల్డ్ నెంబర్ వన్ జూగా పర్యాటకుల్ని ఆకర్షించాలన్న గోల్‌తో పని చేస్తున్నారు అంబానీ. ఈ జూ ప్రపంచంలోని అరుదైన జంతుజాలానికి ఆవాసం కాబోతోంది. జంతువుల కోసం జూలో ప్రత్యేకించి సహజసిద్ధ వాతావరణంతో ఎన్‌క్లోజర్స్ నిర్మించబోతున్నారు. కొమొడొ డ్రాగన్లు, చిరుతలు, పక్షులు, పులుల ఈ జూలో నివాసం ఏర్పరుచుకోనున్నాయి.