Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

వామ్మో.. !వాట్సాప్ లో నెలకి ఇన్ని మెసేజెస్ వెళ్తాయా.. !! Vandebharath

ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లోనూ చూస్తూనే ఉన్నాము. అలాగే అందరి స్మార్ట్ ఫోన్స్ లోను తప్పకుండా ఉండే యాప్ ఏదన్నా ఉందో అంటే...


ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లోనూ చూస్తూనే ఉన్నాము. అలాగే అందరి స్మార్ట్ ఫోన్స్ లోను తప్పకుండా ఉండే యాప్ ఏదన్నా ఉందో అంటే అది వాట్సాప్ అప్ అని అనకుండా ఉండలేము. ప్రపంచంలోనే చాలా ఎక్కువ మంది ఈ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌ ను వాడుతున్నారు. అయితే వాట్సాప్ సంస్థ గురువారం (ఫిబ్రవరి 25)తో మొత్తానికి 12 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది.అంటే ఒక పుష్కర కాలం అన్నమాట. ఈ పుష్కర కాలంలో ఈ సంస్థ సాధించిన విజయాలను, ఘనతలను చెబుతూ 12వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది.

ఈ సందర్భంగా తమ వాట్సాప్ యాప్ ద్వారా వెళ్తున్న మెసేజ్‌లు, వాయిస్ కాల్స్‌, వీడియో కాల్స్ గణాంకాలను అందరితోనూ షేర్ చేసుకుంది. ఈ సంస్థ స్థాపించిన ఈ 12 ఏళ్లలో వాట్సాప్ ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది.అలాగే వాట్సాప్ చాట్ ద్వారా ప్రతి నెలా ఏకంగా 200 కోట్ల మంది యూజర్లు ప్రతి నెల పది వేల కోట్ల మెసేజ్‌లు షేర్ చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.అంతేకాదు ప్రతి రోజు సుమారు 100 కోట్ల వరకు వాట్సాప్ కాల్స్ కూడా వాట్సాప్ నుంచి వెళ్తుండటం విశేషం.

వాట్సాప్ ఇంత పేరు, ప్రఖ్యాతలు సంపాదించినందుకు చాలా ఆనందంగా ఉందని సంస్థ వెల్లడించింది. ఇక వాట్సాప్ వాడే యూజర్ల ప్రైవసీ విషయానికి వస్తే ప్రైవసీ విషయంలో నిబంధనలను కట్టుబడి ఉంటామని వాట్సాప్ మరోసారి స్పష్టం చేసింది.అలాగే తమ ప్లాట్‌ ఫామ్‌పై ఎప్పటికీ ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని కూడా తేల్చి చెప్పింది.ఈ ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వలన వినియోగాదారులకు ఎటువంటి భయం అక్కర్లేదని స్పష్టం చేసింది.వినియోగదారుల వ్యక్తిగత వివరాలు, చాట్ హిస్టరీ అన్ని సేఫ్ గానే ఉంటాయని తెలిపింది. వాట్సాప్ పూర్తి భద్రతా విధానంతో ఉందని ఆ సంస్థ తెలిపింది. !