Tennis Star Maria Sharapova:రైతుల నిరసనపై సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్‌తో ఆగ్రహించిన కేరళ ప్రజలు టెన్నిస్ స్టార్ మరియా షరపోవా సోషల్ మీడియ...
Tennis Star Maria Sharapova:రైతుల నిరసనపై సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్‌తో ఆగ్రహించిన కేరళ ప్రజలు టెన్నిస్ స్టార్ మరియా షరపోవా సోషల్ మీడియా పేజీలలకు లక్షల్లో మెసేజ్‌లను పంపింస్తున్నారు. 2015లో ఒక ఇంటర్వ్యూలో షరపోవా మాట్లాడుతూ.. క్రికెట్ ఐకాన్ సచిన్ టెండుల్కర్ కూడా తనకు తెలియదు అంటూ.. క్రికెట్ గురించి అజ్ఞానాన్ని అంగీకరించారు.
సచిన్ టెండుల్కర్ తెలియదు అంటూ అప్పట్లో షరపోవా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అప్పట్లో రెచ్చిపోయిన క్రికెట్ ఫ్యాన్స్.. షరపోవాను విపరీతంగా ట్రోల్ చేశారు. షరపోవా అలా మాట్లాడడం చాలా తప్పంటూ తీవ్రంగా హేట్ చేశారు. అయితే ఇప్పుడు సచిన్ లేటెస్ట్‌గా రైతుల విషయంలో చేసిన వ్యాఖ్యలు కారణంగా సీన్ మారిపోయింది.
వేలమంది నెటిజన్‌లు షరపోవాకు క్షమాపణలు చెబుతూ లక్షల్లో మెసేజ్‌లు పెట్టేస్తున్నారు. సచిన్ విషయంలో అప్పట్లో తిట్టినందుకు షరపోవాకు క్షమాపణ కోరుతూ పోస్టులు పెడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో అందరూ ఒక్కసారిగా సారీ ఎందుకు చెబుతున్నారో అర్థం కాక కన్‌ఫ్యూజ్ అవుతున్నట్లు చెప్పుకొచ్చారు షరపోవా..