Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

కిరణ్ బేడీని పక్కన పెట్టడం వెనుక అసలు కథ - Vandebharath

  పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడిని కేంద్రం ఎందుకు పక్కన పెట్టింది. పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి ఉత్తమ...


 

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడిని కేంద్రం ఎందుకు పక్కన పెట్టింది. పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి ఉత్తమ అధికారిగా పేరు ఉంది. కానీ ఆమె తనకు బీజేపీ పెద్దలు అప్పగించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యారు. ముఖ్యమంత్రి నారాయణ స్వామి చేసే తప్పులను ఎత్తి చూపాలని ఆమెకు ఆదేశాలు ఉండగా, రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుని, నారాయణ స్వామికి ప్రజల్లో సానుభూతి పెరిగేలా చేశారని బీజేపీ పెద్దలు భావించినట్లు తెలుస్తోంది. కిరణ్ బేడిని తప్పించాలని ఐదేళ్లుగా నారాయణ స్వామి వివిధరకాలుగా పోరాడుతున్నారు. చివరకు ఆమెను కేంద్రం .. పదవి నుంచి తొలగించింది.


పుదుచ్చేరి శాసన సభకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. దక్షిణాదిలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. దీంతో పార్టీ కార్యక్రమాలను, వ్యూహాలను పక్కాగా అమలు చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిలో ఓ రాజకీయవేత్తను నియమించాలని బీజేపీ భావిస్తోంది. తగినంత మెజారిటీ రాకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే వ్యక్తిని ఎంపిక చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తాత్కాలిక లెఫ్టినెంట్ గవర్నర్ గా తమిళిసైకు బాధ్యతలు అప్పగించింది. ఆమె ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసింది. ఇకపై తమిళిసై తెలంగాణ గవర్నర్ గా, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కొనసాగనుంది.

వచ్చే ఎన్నికల కోసం మాజీ ముఖ్యమంత్రి ఎన్ రంగ స్వామి నేతృత్వంలోని... ఎన్ఆర్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే చర్చలకు ముందే కిరణ్ బేడీకి ఉద్వాసన పలకాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. దీంతో ఇది కూడా కిరణ్ బేడీ పదవి పోవడానికి ఒక కారణం అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరిలో తన సత్తా చాటాలని చూస్తోంది. అందులో భాగంగానే లెఫ్టినెంట్ గవర్నర్ ను పక్కన పెట్టి రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తిని ఆ స్థానంలో భర్తీ చేయాలని భావించింది. అందుకే తమిళిసైకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించింది.