Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఆస్పత్రిలో మారిపోయిన పిల్లలు... Vandebharath

  ఆస్పత్రిలో ఒకేసారి ప్రసవం అయిన తల్లుల బిడ్డలు మారిపోయారనే సినిమాల్లో చూస్తుంటాం.కానీ అదే నిజ జీవితంలో జరిగితే..ఆస్పత్రిలో పుట్టిన పిల్లలు ...

 

ఆస్పత్రిలో ఒకేసారి ప్రసవం అయిన తల్లుల బిడ్డలు మారిపోయారనే సినిమాల్లో చూస్తుంటాం.కానీ అదే నిజ జీవితంలో జరిగితే..ఆస్పత్రిలో పుట్టిన పిల్లలు మారిపోయారని..ఆ విషయం 28 ఏళ్ల తరువాత తెలిస్తే..ఇది నిజమా? లేక సినిమానా? అనిపిస్తుంది కూడా. అచ్చం అదే జరిగింది క్యాన్సర్ తో బాధపడే ఓ యువకుడి విషయంలో. క్యాన్సర్ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తుంటాయి. అలా ఓ యువకుడికి వంశపారంపర్యంగా వచ్చిన క్యాన్సర్ కనీవినీ ఎరుగని ఘటనకు కారణమైంది.అడ్వాన్స్‌డ్‌ లివర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తికి ఓ వార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చినా. .. మరో రూపంలో అతని కుటుంబానికి కోటిరూపాయలు నష్టపరిహారంగా దొరికాయి. విచిత్రంగా ఉన్న ఈ సంఘటన

ఈస్ట్‌ చైనా జియాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన యోసే అని వ్యక్తి 28 ఏళ్ల క్రితం హువాయ్‌ ఆసుపత్రిలో జన్మించాడు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో తన సొంత తల్లిదండ్రులకు దూరమయ్యాడు. వేరే దంపతులకు పుట్టిన బిడ్డగా పెరుగుతున్నాడు. ఈ విషయం తెలియని ఇరు కుటుంబాల వారు తమ దగ్గర ఉన్న బిడ్డలని వారి బిడ్డల్లాగే పెంచుకున్నాడు. వారి జీవితాలు అలాగే కొనసాగితే వారి తల్లిదండ్రలు వారు కాదని తమ వద్ద పెరిగే పిల్లలు తమ పిల్లలు కాదని తెలిసేది కాదేమో. క్యాన్సర్ వ్యాధి రూపంలో వచ్చిన ఓ కష్టం అసలు విషయాన్ని బైటపడేలా చేసింది.

ఈ మధ్యకాలంలో యోకు అడ్వాన్స్‌డ్‌ లివర్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తే కొంత ఉపయోగం ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో యో వాళ్ల అమ్మ (పెంచిన తల్లి) కొడుకుని బతికించుకోవటానికి తన లివర్‌ డొనేట్‌ చేసేందుకు మందుకొచ్చింది.

కానీ ఆమె బ్లడ్‌గ్రూప్‌ యోకు మ్యాచ్‌ కాలేదు. తల్లి, కొడుకుల బ్లడ్ ఎందుకు మ్యాచ్ కాలేదో వాళ్లకు అర్థం కాలేదు. దీంతో యో కుటుంబం యో పుట్టిన ఆసుపత్రికి వెళ్లి ఎంక్వైరీ చేశారు. అక్కడ యో బయోలాజికల్‌ తల్లిదండ్రులు వీళ్లు కాదని తెలిసింది. ఆమె లివర్ యోకు సెట్ కాదని చెప్పారు.అది విన్న యోతో పాటు వారి తల్లిదండ్రులు కూడా షాక్ అయ్యారు. ఆసుపత్రి చేసిన తప్పును యో తల్లిదండ్రులు కైఫెంగ్‌ ఇంటర్మీడియెట్‌ పీపుల్స్‌ కోర్టును ఆశ్రయించారు.

''మాబిడ్డ వేరే వారి బిడ్డగా పెరుగుతున్నాడు. మా కొడుకుగా పెరిగినవాడికి క్యాన్సర్ వచ్చింది. దానికి ట్రీట్ మెంట్ చేయించి బత్రికించుకుందామంటే ఇది పరిస్థితి..ఇప్పుడు మేం ఏంచేయాలి? క్యాన్సర్ వచ్చిన మా కొడుకు (పెంచిన కొడుకు)ను ఎలా బతికించుకోవాలి? ఇప్పటివరకూ మా బిడ్డగా పెరిగినవాడిని మా కొడుకు కాదని అనుకోలేం. వదులుకోలేం. కానీ అతడిని బతికించుకునే దారి లేదు మాకు న్యాయం చేయండీ..మా కొడుకుని బతికించుకునేలా న్యాయం చేయండి''అని వేడుకున్నారు.

ఈ విచిత్ర కేసును విచారించిన కోర్టు ''పిల్లలను మార్చినందుకుగాను ఆసుపత్రి కోటిరూపాయల నష్టపరిహారం చెల్లించమని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించింది. దీంతో యో కుటుంబానికి 10 లక్షల యువాన్లు అంటే భారత కరెన్సీ ప్రకారం.. రూ.1,12,78,809 నష్టపరిహారంగా అందనుంది. ఆ డబ్బులతో యోకు లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్ చేయించాలనుకుంటున్నారు. కాగా..ఇక్కడ మరో విషయం ఏమిటంటే..యోను కన్నతల్లికి కూడా లివర్‌ క్యాన్సర్‌ ఉందట. అందువల్లే యోకూ కూడా వంశపారంపర్యంగా వచ్చిందని డాక్టర్లు అంటున్నారు.