టీడీపీ వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేసింది. ఫైబర్ నెట్‌కు సంబంధించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.. ఓ లేఖ రాసింది. ఫైబర్ నెట్ లో సీఎం ఫో...
టీడీపీ వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేసింది. ఫైబర్ నెట్‌కు సంబంధించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.. ఓ లేఖ రాసింది. ఫైబర్ నెట్ లో సీఎం ఫోటో రాకుండా చర్యలు తీసుకోవాలి అని లేఖలో కోరారు.
ఏపీ పంచాయతీ ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోపై అధికార పార్టీ అభ్యంతరం తెలపడంతో.. ఎస్ఈస్ స్పందించి చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేసింది. ఫైబర్ నెట్‌కు సంబంధించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.. ఓ లేఖ రాసింది.
రాష్ట్రవ్యాప్తంగా టీవీ ఆన్ చేయగానే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోటో వస్తోందని అని టీడీపీ ఎస్ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది.
రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఫైబర్ నెట్ కనెక్షన్లు ఉన్నాయని.. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీవీలో సీఎం ఫోటో రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. Difalut కింద ఫైబర్ నెట్ లో సీఎం ఫోటో వచ్చేలా ఏర్పాటు చేశారు అని ఫిర్యాదు చేసింది. వెంటనే ఫైబర్ నెట్ లో సీఎం ఫోటో రాకుండా చర్యలు తీసుకోవాలి అని లేఖలో కోరారు. సీఎం ఫోటో వ్యవహారంపై ఎన్నికల కమిషనర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఎస్ఈసీ రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించిన వాహనాల రంగులను వెంటనే మార్చాలని ఆదేశించారు. వాహనాలపై అధికార వైఎస్సార్‌సీపీజెండాకు సంబంధించిన రంగులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేని రంగులు వేసి రేషన్ డోర్ డెలివరీ వాహనాలు తిప్పాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకు గ్రామాల్లో వాహనాలతో రేషన్ పంపిణీ నిలిపివేయాలని తేల్చి చెప్పారు. రంగులు మార్చాకే వాహనాల ద్వారా పంపిణీకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం ఈ వాహనాలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు.