Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

అమెరికా: ఇండియా గ్లోబల్ పవర్‌గా ఎదగడాన్ని స్వాగతిస్తున్నాం - Vandebharath

  వాషింగ్టన్‌: అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం మంగళవారం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండియా గ్లోబల్ పవర్‌గా ఎదగడాన్ని తాము స్వాగతిస్తున్నా...


 

వాషింగ్టన్‌: అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం మంగళవారం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండియా గ్లోబల్ పవర్‌గా ఎదగడాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఇండోపసిఫిక్ ప్రాంతంలో ఇండియా చాలా ముఖ్యమైన భాగస్వామి అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. అంతకుముందే భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ మాట్లాడారని, 15 రోజుల వ్యవధిలో ఈ ఇద్దరూ మాట్లాడుకోవడం ఇది రెండోసారని ప్రైస్ వెల్లడించారు.

ఈ ఫోన్ కాల్ సందర్భంగా ఇండియా, అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని వాళ్లు నిర్ణయించినట్లు చెప్పారు. మయన్మార్‌లో పరిస్థితిపై ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంస్థల్లోనూ తాము కలిసి పని చేస్తామని, గత నెలలో ఇండియా భద్రతా మండలిలో చేరడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ప్రైస్ చెప్పారు.