Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

హ్యాపీ బర్త్‌డే టూ బ్రాహ్మానందం గారు!! హాస్య బ్రహ్మ బర్త్‌డే - Vandebharath

  హాస్య బ్రహ్మ, కామెడీ కింగ్‌ బ్రహ్మానందం నేటితో 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. సోమవారం (ఫిబ్రవరి 1) ఆయన పుట్టిన రోజు సందర్భంగా కామెడీ కిం...

 


హాస్య బ్రహ్మ, కామెడీ కింగ్‌ బ్రహ్మానందం నేటితో 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. సోమవారం (ఫిబ్రవరి 1) ఆయన పుట్టిన రోజు సందర్భంగా కామెడీ కింగ్‌కు పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు నటీనటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆశిస్తూ స్టార్‌ హీరోలు, అభిమానుల నుంచి బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తున్నాయి. ‘హ్యాపీ బర్త్‌డే కామెడీ కింగ్ మీరు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలని ఆ దేవుడి పార్థిస్తున్న’ అంటూ సాయి ధరమ్‌ తేజ్‌ ట్వీట్‌ చేయగా.. రామ్‌ చరణ్‌ కూడా ‘వెరీ హ్యాపీ బర్త్‌డే టూ కామెడీ కింగ్‌ పద్మశ్రీ బ్రహ్మానందం అంకుల్‌’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు.


అంతేగాకుండా మాస్‌ మహారాజ రవీతేజ కూడా ట్వీట్‌ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే టూ బ్రాహ్మానందం గారు!! మీతో ఉంటే అసలు షూటింగ్‌లో అలసటే ఉండదు.. ఎప్పుడూ షూటింగ్స్‌ను‌ సరదగా.. ఆనందంగా చేస్తారు. అందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో నవ్వతూ ఉండాలని ఆశిస్తున్న’ అంటూ విష్‌ చేశాడు. అంతేగాక మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అర్జున్‌లతో పాటు పలువురు స్టార్‌ హీరోహీరోయిన్‌లు, దర్శకులు, నిర్మాతలు సైతం ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.