Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

త్రివర్ణ పతాకానికి అవమానం జరగడంతో దేశమంతా బాధపడింది ప్రధాని నరేంద్ర మోదీ- vandebharath

జనవరి 26న ఢిల్లీలో త్రివర్ణ పతాకానికి అవమానం జరగడంతో దేశమంతా బాధపడిందని ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశ...



జనవరి 26న ఢిల్లీలో త్రివర్ణ పతాకానికి అవమానం జరగడంతో దేశమంతా బాధపడిందని ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఈ ఘ‌ట‌న‌తో దేశం దిగ్భ్రాంతికి గురైంద‌ని చెప్పారు.  రాష్ట్రపతి సందేశంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో పద్మ పురస్కారాలను కూడా ప్రకటించడం జరిగింది. ఇటువంటి పురస్కారాలు అందుకున్నవారు అందరికీ స్ఫూర్తినిస్తూ, దేశాన్ని ముందుకు నడిపిస్తారని కొనియాడారు.

మరోవైపు క్రికెట్ పిచ్ నుంచి కూడా శుభవార్త అందింది. మన టీమ్ ఆస్ట్రేలియా సిరీస్‌ను దక్కించకుంది. మన క్రీడాకారులు హార్డ్ వర్క్, టీమ్ వర్క్ చేయడంతో ఈ విజయం సాధించారు. అయితే వీటన్నింటిమధ్య ఢిల్లీలో జనవరి 26న త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానంతో యావత్ భారత దేశం బాధపడిందని విచారం వ్యక్తం చేశారు.

ఇక కరోనాను జయించడం విషయానికొస్తే భారత్ ఇతర దేశాలకు ఉదాహరణగా నిలిచిందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్‌లో భారత్ ఇతర దేశాల కన్నా ముందుందని చెబుతూ  కేవలం 15 రోజుల్లో 30 లక్షలకు మించిన కరోనా వారియర్స్‌కు టీకాలు వేయగలిగామని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఔష‌ధాలు, టీకాల విష‌యంలో భార‌త్ స్వావలంబ‌న సాధించింద‌ని, అందుకే వ్యాక్సినేష‌న్‌లో పొర‌గు దేశాల‌కు కూడా స‌హాయం చేయ‌గ‌లుతున్నామ‌ని ప్ర‌ధాని తెలిపారు.  

దేశంలోని ర‌చయిత‌లు, ముఖ్యంగా యువ ర‌చయిత‌లు స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల త్యాగాల గురించి రాయాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సంగ్రామం సంద‌ర్భంగా యోధులు వారివారి ప్రాంతంలో చూపిన తెగువ‌, ప‌రాక్ర‌మాల గురించి పుస్త‌కాలు రాయాల‌ని ఆయ‌న‌ సూచించారు.  దేశం 75వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకోబోతున్న నేప‌థ్యంలో స‌మ‌ర‌యోధుల గురించి మీరు చేసే ర‌చ‌న‌లే వారికి ఘ‌న‌మైన నివాళి అని ప్ర‌ధాని పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలో మ‌హిళ‌లు అన్ని రంగాల్లో త‌మ స‌త్తా చాటుతున్నార‌ని ప్ర‌ధాని ప్రశంసించారు.

కొన్ని రోజుల క్రితం దేశానికి చెందిన న‌లుగురు మ‌హిళా పైలెట్లు అమెరికా నుంచి బెంగ‌ళూరుకు విమానాన్ని న‌డిపి 225 ప్ర‌యాణికులను గ‌మ్యానికి చేర్చిన విష‌యాన్ని ఆయ‌న గుర్తుచేశారు. దేశంలో మ‌హిళాశ‌క్తి పురోగ‌తి సాధిస్తుంద‌న‌డానికి ఇది ఒక నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పారు. ఇటీవలే ఝాన్సీలో స్ట్రాబెరీ ఫెస్టివల్ ప్రారంభమైందని, ఇది నెల్లాళ్లపాటు కొనసాగుందని తెలిపారు. ఈ మహోత్సన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత, రైతులు ఆధునిక సాంకేతికత సహాయంతో స్ట్రాబెరీ తోటలను పెంచాలని కోరారు.