Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

బాల్య వివాహాలు విపరీతంగా పెరిగే అవకాశం - సేవ్ ద చిల్డ్రన్ సంస్థ - vandebharath

  కరోనావైరస్ వ్యాప్తి నడుమ ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహాలు విపరీతంగా పెరిగే ముప్పుందని ఓ స్వచ్ఛంద సంస్థ హెచ్చరిస్తోంది. మనం 25ఏళ్లుగా సాధ...

 


కరోనావైరస్ వ్యాప్తి నడుమ ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహాలు విపరీతంగా పెరిగే ముప్పుందని ఓ స్వచ్ఛంద సంస్థ హెచ్చరిస్తోంది. మనం 25ఏళ్లుగా సాధించిన పురోగతి తిరోగమన బాట పట్టే అవకాశముందని సంస్థ పేర్కొంది.

కోవిడ్-19 వ్యాప్తి నడుమ 2025నాటికి 25 లక్షల మంది చిన్నారులు బాల్య వివాహాల బారినపడే అవకాశముందని సేవ్ ద చిల్డ్రన్ సంస్థ అంచనా వేసింది.

''కరోనావైరస్ వ్యాపించడంతో పేదరికం పెరుగుతోంది. దీంతో బాలికలు బడి మానేయాల్సి వస్తోంది. ఫలితంగా వారు పనులకు వెళ్లడం లేదా వారికి పెళ్లి చేసేయడం జరుగుతోంది''

భారత్ సహా దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లోని బాలికలు ఈ ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.

బాల్య వివాహాలను అరికట్టేందుకు, లింగ సమానత్వాన్ని కాపాడేందుకు ప్రపంచ నాయకులు కదిలి రావాలని సంస్థ పిలుపునిచ్చింది.

''ఇలాంటి వివాహాలతో బాలికల హక్కులు ఉల్లంఘనకు గురవుతాయి. కుంగుబాటు ముప్పు పెరుగుతుంది. జీవితాంతం వారు గృహహింసకు బాధితులుగా మారుతారు. కొందరికి మరణ ముప్పు కూడా ఎక్కువవుతుంది''అని సేవ్ ద చిల్డ్రన్ అడ్వైజర్ కరేన్ ఫ్లానగన్ వ్యాఖ్యానించారు.

గత 25ఏళ్లలో 7.86 కోట్ల బాల్య వివాహాలను అరికట్టగలిగామని, కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మళ్లీ బాల్య వివాహాలు పెరిగేలా కనిపిస్తున్నాయని ఆమె చెప్పారు.