Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కొత్తగా జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులకు మైక్రోచిప్ - vandebharath

  కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగ...

 


కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా వారివారి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్ అప్ డేట్ చేయాల్సివుంటుంది. వాహనదారుల వాహనానికి ఆర్సీ బుక్ ఉన్నప్పటికీ, అలాగే వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్స్‌లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ అప్‌డేట్ చేసుకోవల్సిందే.

అసలు ఈ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్‌లకు మళ్లీ కొత్తగా అప్ డేట్ చేయడం ఏంటి అనుకోవచ్చు. అది ఏంటంటే అక్టోబరు ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నిబంధనలు కేంద్రప్రభుత్వం పలు మార్పులు చేస్తోంది.

ఈ మార్పు మేరకు వాహనాల రిజిస్ట్రేషన్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. అందుకే ప్రతి వాహనదారుడు తమ డ్రైవింగ్ లైసెన్సులను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్పులు చేసిన కొత్త నిబంధనలు కూడా అక్టోబరు 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తున్నాయి. 

కొత్తగా జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులకు మైక్రోచిప్ ఉంటుంది. క్యూఆర్ కోడ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్లు కూడా ఉంటాయి. అంతేకాదు యూనిఫాం వెహికిల్స్ రిజిస్ట్రేషన్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయనున్నారు. ఇక ఆర్సీల విషయంలో అక్టోబరు 1 నుంచి ఈ ప్రక్రియను కాగితాన్ని ఉపయోగించకుండా చేయాలని నిర్ణయించుకుంది.

అలాగే, సెంట్రలైజ్ చేసిన ఈ డేటా పదేళ్ల వరకు ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కొత్త ఆర్సీకి యజమాని పేరు ముందు భాగంలో ఉంటుంది. వెనుకభాగంలో మైక్రోచిప్, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ డేటా సహాయంతో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తులకు పెనాల్టీ వేయడం, రికార్డులను నిర్వహించడం ప్రభుత్వానికి సులభమవుతుంది.