Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో శ్రద్ధాకపూర్, సారా ఆలీఖాన్ - vandebharath

  బాలీవుడ్  డ్రగ్స్ కేసులో సినీ తారలు శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ వా...

 


బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ తారలు శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ వారం వారిద్దరికీ సమన్లు జారీ చేస్తారని దర్యాప్తు అధికారి ఒకరు చెప్పారు.
నటుడు సుశాంత్ మృతి కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి దర్యాప్తులో శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ ల పేర్లను వెల్లడించింది. 34 ఏళ్ల సుశాంత్  జూన్ 14న ముంబైలోని ఇంట్లో మృతి చెందారు. గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పై సుశాంత్ కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు.
సుశాంత్ కు డ్రగ్స్ ఏర్పాటు చేసినట్లు రియాపై ఆరోపణలు ఉన్నాయి. రియా చక్రవర్తి డిలీట్ చేసిన వాట్సప్ మెసేజ్ లను రిట్రీవ్ చేసిన అధికారులు వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సుశాంత్ మేనేజర్ శృతి ఎన్ సీబీ అధికారులు సోమవారం సమన్లు ఇచ్చారు.
ఇంకా,  దీపికా పదుకొనే, ఆమె మేనేజింగ్‌ ఏజెన్సీకి చెందిన కరిష్మా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, డిజైనర్‌ సిమోన్‌ ఖంబట్టా లను కూడా విచారించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్‌సీబీ మరో నిందితుడిని ప్రశ్నిస్తున్న సమయంలో ‘డీకే’ అనే పొడి అక్షరాలు డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించిన చాటింగ్‌ గ్రూప్‌లో గుర్తించింది. 
 
డీ అంటే.. దీపికా పదుకొనే అని.. కే అంటే.. ‘క్వాన్‌’ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీకి చెందిన కరిష్మా అని గుర్తించారు. ఆమె దీపికాకు కూడా సేవలందిస్తున్నట్లు నిర్ధారించారు. మరోవంక బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు అమృత్‌సర్‌, పాకిస్థాన్‌లకు లింకులు ఉన్నట్లు ఎన్‌సీబీ గుర్తించింది.