డ్రగ్గ్స్‌ కేసు విచారణకు హాజరైన రకుల్‌ - vandebharath

 


బాలీవుడ్‌–డ్రగ్స్‌ సంబంధాలపై విచారణలో భాగంగా  శుక్రవారం హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హాజరైంది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) రెండు రోజుల క్రితం విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఎన్‌సీబీ పిలుపుమేరకు గురువారమే గోవా నుంచి ముంబై చేరుకుని శుక్రవారం ఉదయం ఎన్‌సీబీ ముందు హాజరైంది.

డ్రగ్స్‌ వాడకంపై రకుల్‌ను ఎన్‌సీబీ ప్రశ్నించనుంది. బుధవారం దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లకు తదితరులకు సమన్లు పంపిన విషయం తెలిసిందే. నేడు రకుల్‌ విచారణ అనంతరం శనివారం దీపికను ప్రశ్నించనున్నారు. అయితే శుక్రవారం విచారణలో భాగంగా దీపిక మేనేజర్‌ కూడా ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్నారు.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కోణంలో విచారణ చేపట్టిన ఎన్‌సీబీ..బాలీవుడ్‌–డ్రగ్స్‌ సంబంధాలపై దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తితో పాటు మరికొంతమందిని కస్టడీలో తీసుకుని విచారిస్తోంది.

Post A Comment
  • Blogger Comment using Blogger
  • Facebook Comment using Facebook
  • Disqus Comment using Disqus

No comments :


రాజకీయాలు

[news][bleft]

చరిత్ర

[history][twocolumns]

సైన్యం

[army][threecolumns]

చిన్న కథలు

[army][grids]

క్రీడలు

[sports][list]

వినోదం

[entertainment][bsummary]