Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

జమ్మూకశ్మీర్‌లో భారీగా పేలుడు పదర్థాలు స్వాధీనం - vandebharath

  జ మ్మూకశ్మీర్‌లోని అవంతిపొరా జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జిల్లా పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్‌...

 


మ్మూకశ్మీర్‌లోని అవంతిపొరా జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జిల్లా పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్పీఎఫ్‌ సంయుక్తగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఈ పేలుడు పదార్థాలను గురువారం ఉదయం గుర్తించినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. కరేవా ప్రాంతంలోని ఓ గుంతలో పాతిపెట్టిన ప్లాస్టిక్‌ వాటర్‌ ట్యాంక్‌లో మొత్తం 52 కేజీల పేలుడు పదార్థాలను గుర్తించారు. ఇందులో 125 గ్రాముల చొప్పున ఉన్న 416 ప్యాకెట్ల పేలుడు పదార్థాలు ఉన్నాయి. మరో గుంతలో దొరికిన ప్లాస్టిక్‌ ట్యాంక్‌లో 50 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ తెలిపింది.

జాతీయ రహదారికి సమీపంలో ఈ పేలుడు పదార్థాలు గుర్తించారు. గతేడాది పుల్వామాలో దాడి ఘటన జరిగిన ప్రదేశానికి ఈ ప్రాంతం 9 కిలోమీటర్లే కావడం గమనార్హం. వీటిని గుర్తించడం ద్వారా మరో ఉగ్రకుట్రను భగ్నం చేసినట్లు అయ్యిందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. 2019 ఫిబ్రవరిలో 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని పేలుడు పదార్థాలతో కూడిన కారుతో ఓ ముష్కరుడు ఢీకొట్టాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు పాకిస్థాన్‌ బాలాకోట్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలపై మన వాయు సేన బలగాలు దాడులు నిర్వహించాయి.

Source: VSK Andhra