Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

చైనా సవాళ్ళను త్రిప్పి కొట్టేందుకు సిద్దమవుతున్న భారత్ -vandebharath

ఆసియాఖండంలో దిగ్గజాలైన భారత్ చైనా పురాతనదేశాలు సహజమైనసాంస్కృతిక, వాణిజ్యసంబంధాలు ఉన్నదేశాలు చైనా కమ్యూనిస్టు దేశంగా అవతరించినప్ప...

ఆసియాఖండంలో దిగ్గజాలైన భారత్ చైనా పురాతనదేశాలు సహజమైనసాంస్కృతిక, వాణిజ్యసంబంధాలు ఉన్నదేశాలు చైనా కమ్యూనిస్టు దేశంగా అవతరించినప్పటి నుండి భారత భూభాగాలను ఆక్రమించుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నది. 1950లో చైనా టిబెట్టును ఆక్రమించుకొంది. 1962లో భారత్ పైఅకస్మాత్ గా యుద్ధం ప్రకటించి కొన్ని భూభాగాలు కబ్జా చేసింది. పాకిస్తానుకు ఆర్ధికంగా ఆయుధ పరంగా సహకరిస్తూ భారత సరిహద్దులను రావణకాష్టం గ మార్చింది. భారత్ ఎప్పుడూ బలహీనంగానే ఉండాలనే వ్యూహాలు పన్నుతూనే ఉన్నది. సరిహద్దులు చెరిపేసి భూభాగాలు ఆక్రమించుకోవడం చైనా ది అందెవేసిన చెయ్యి. టిబెట్ ను ఆక్రమించుకున్న తర్వాత చైనా దృష్టి భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ మీద పడింది దానికోసం గడిచిన అనేక సంవత్సరాలుగా కయ్యానికి కాలు దువ్వుతున్న ది. చైనా ఒక రాక్షస శక్తి అది తన దేశంలో యువకులు మీదే యుద్ధ ట్యాంకులు నడిపి క్రూరంగా చంపిన దేశం.

చైనాను నిలువరించ గల శక్తి కేవలం భారత్ కి ఉంది చరిత్రలో చైనాతో భారతదేశంతో జరిగిన యుద్ధంలో శైలేంద్రడు అనే రాజు చైనాకు కోలుకోలేని దెబ్బ కొట్టాడు ఆ తదుపరి 1962 సంవత్సరంలో చైనా మళ్లీ మన దేశం జోలికి వచ్చింది మళ్లీ గడిచిన కొద్ది సంవత్సరాలుగా భారత సరిహద్దుల్లో హడావిడి చేస్తున్నది మొన్న జూన్ 15న చైనా భారతీయసైనికు లపై దాడి చేసి ఎదురుదెబ్బతిని యుధ్ధ వాతావరణం నిర్మాణం చేసింది, పైకొద్ది దానికి కారణం భారత్ అని బుకాయించటం ప్రారంభిచింది. దానిలో భాగంగా జూలై 1న చైనా ప్రభుత్వ పత్రికైన GLOBALTIMES పత్రికలో ఒక వ్యాసం వ్రాయించింది. గ్లోబల్ టైమ్స్ పత్రికకు గతంలో భారత్ లో కరస్పాండెంట్ గా పనిచేసిన Yuan Jirong వ్రాసిన వ్యాసంలో భారత్  దేశంలో హిందూత్వ జాతీయవాదలు ఒకప్రముఖ శక్తిగా అవతరిస్తూ చైనా సైనిక శక్తితో, ఆర్థికశక్తితో పోటీపడుతు ఒక ప్రపంచశక్తిగా కావాలని కలలు  గంటున్నది. భారతదేశంలొ ఉన్న బహుళత్వంను    దెబ్బతీస్తున్నది సెక్యూలర్  భావాలను చేరిపేస్తున్నది  చైనా పై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం దానిలో భాగం.

భారత్ లోని  భారతీయ జనతా పార్టీ  చైనా వ్యతిరేక నినాదాలు చేయటమే కాక కొన్ని ప్రత్యేక అంశాలపై దాడి చేస్తున్నది. భారత్  అంతర్జాతీయ విషయాలలో కీలకపాత్ర వహించి తన రాజకీయ అవసరాలు పూర్తి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నది. భారత్ లో చైనా వ్యతిరేక సెంటిమెంట్ నిర్మాణంచేసి 1962 పరాజయానికి చైనాకు పాఠం నేర్పాలని కలలు గంటున్నది. భారత్ మీడియా కు భారత్ కు చైనాతో కంటే అమెరికాతో సంభందాలు ఉండాలని కోరుకొంటున్నది. భారత్ అమెరికాతో కలిసి ప్రపంచ శక్తి గా ఎదగాలని కోరుకొంటున్నది. ఇట్లా కొన్ని విషయాలు వ్రాసుకొంటూ వచ్చింది. వ్యాసమంతా చదివితే ఒక విషయం స్పష్టముతున్నది భారత్ ఎప్పుడు బలహీనంగానే ఉండాలి.

భారత సరిహద్దులలో ఉన్న దేశాలనుండి సమస్యలు సృష్టిస్తూ నిలకడ లేకుండా చేయాలనీ అది సాధ్యం కాకపోతే సైనిక వత్తిడి తేవాలి దానితో రాయబారాలకు లాగాలని చైనా ఊహా లోకాలలో ఉన్నది కానీ ఏదురు దెబ్బతిన్నది. ఇప్పుడు చైనా పైన వత్తిడి పెరిగింది. బలప్రయోగం, బెదిరింపు ధోరణితో తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించడం సరికాదు. ఈ విషయాన్ని చైనా గుర్తించడమే ప్రస్తుత సైనిక ప్రతిష్టంభన పరిష్కారానికి ఉన్న ఏకైక మార్గం. ద్వైపాక్షిక బంధంలో పురోగతి కోసం సరిహద్దుల్లో శాంతిని పరిరక్షించడం అవసరం. భారత బలగాల సాధారణ గస్తీకి చైనా అవరోధాలు సృష్టించకుండా ఉండాలి. మా కోణంలో చూస్తే ఈ వివాదానికి సూటి పరిష్కారం ఇదే.- విక్రమ్‌ మిస్రీ, చైనాలో భారత రాయబారి భారత్ శాంతి ని కోరుతూ చర్చలకుసిద్ధం మరోప్రక్క ఎటువంటి పరిస్థితులు ఎదురైనా త్రిప్పికొట్టేందుకు సిద్ధం. భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా లద్దాఖ్‌లో పర్యటిస్తున్నారు. భద్రతా దళాల్లో ధైర్యం నింపడమే లక్ష్యంగా మోదీ పర్యటన కొనసాగుతోంది. త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌, సైనికాధిపతి నరవాణే... ప్రధాని మోదీ వెంట ఉన్నారు. చైనాతో సరిహద్దు వివాదం, సైన్యం చర్చల్లో పురోగతి నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాకు గట్టి సందేశం ఇవ్వడంలో భాగంగానే ప్రధాని లద్ధాఖ్‌లో పర్యటించినట్లు తెలుస్తోంది. ప్రధాని పర్యటన ద్వారా సైన్యానికి దేశం మొత్తం మద్దతుగా ఉందనే సంకేతాన్ని మోదీ ఇచ్చారని రక్షణ నిపుణులు అభిప్రాయపడ్డారు.ఇట్లా దేశంఏ పరిస్థితులనైనా  ఎదుర్కొనేందుకు  సంసిద్ధం అవుతున్నది. జయహో భారత్.