Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఐదేళ్ళ బాలికపై అత్యాచారం, హత్య కేసులో మహ్మద్ రఫీకి మరణశిక్ష - vandebharath

  ఐదేళ్ళ బాలికపై అత్యాచారం, హత్య కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేరం రుజువు కావడంతో నిందితుడి మహ్మద్‌ రఫీ (27)కి మరణశ...

 
ఐదేళ్ళ బాలికపై అత్యాచారం, హత్య కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేరం రుజువు కావడంతో నిందితుడి మహ్మద్‌ రఫీ (27)కి మరణశిక్ష విధించింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో మొదటి జిల్లా కోర్టు న్యాయమూర్తి వెంకట హరినాథ్‌ ఈ తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది నవంబర్‌ 7న చిన్నారి తల్లిదండ్రులతో కలిసి ఓ వివాహ వేడుక కోసం జిల్లాలోని కురబలకోటకు వెళ్లింది.

ఈ క్రమంలో నిందితుడు మహ్మద్‌ రఫీ.. బాలికకు మాయ మాటలు చెప్పి కల్యాణ మండపం పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటనపై తల్లిదండ్రులు మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. నాలుగు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సోమవారం న్యాయస్థానం ఈ కేసును విచారించి నిందితుడికి మరణశిక్ష విధించింది.