Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాశ్మీర్ మీద చర్చ - పొట్లూరి పార్థసారది - vandebharath

'అక్క ఆరాటమే గానీ బావ బతుకబోయాడా ' అని సామెత ! ఆర్టికల్ 370 రద్దు చేయగానే మన ఖాన్గ్రేస్ కంటే ఎక్కువ రంకెలు వేసింది పాకిస్తాన్. ఓ...


'అక్క ఆరాటమే గానీ బావ బతుకబోయాడా ' అని సామెత ! ఆర్టికల్ 370 రద్దు చేయగానే మన ఖాన్గ్రేస్ కంటే ఎక్కువ రంకెలు వేసింది పాకిస్తాన్. ఓ హాఫ్ లీటర్ పెట్రోల్ కొట్టించి రెండు C-30 సైనిక రవాణా విమానాలని సరిహద్దుల్లోకి తరలించి చూశారా మన సైన్యం భారత్ తో యుద్ధానికి సిద్ధంగా ఉంది ఏ క్షణం లోనైనా జమ్మూ కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలిపెస్తాం అంటూ ఆ విమానాల ఫోటోలు,విడియోలూ ప్రసారం చేసి ప్రచారం చేసుకుంది.పాకిస్తాన్ ప్రజలు ఈ సారి నమ్మలేదు. గోధుమలు కిలో 200/- ,టమోటాలు కిలో 300/- అయ్యాయి మా దృష్టి మరల్చడానికే ఇదంతా అంటూ సైన్యం అనుకూల మీడియా గొట్టాల ముందు ఆక్శ్రోశం వెళ్లగక్కారు. ఇక లాభం లేదు అనుకోని ఆల్ వెదర్ ఫ్రెండ్ [విటుడు ?]ని బ్రతిమాలి ఎలాగయినా ఈ గండం నుండి గట్టెక్కించమని ప్రాధేయపడింది.
ఇమ్రాన్ ఖాన్ [అనే కన్నా సైన్యం అంటేనే కరెక్ట్] చైనా మీద వత్తిడి తీసుకొచ్చి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాశ్మీర్ మీద చర్చ పెట్టించాల్సిందిగా కోరింది. వారం క్రితమే భద్రతా మండలి ద్వైపాక్షిక చర్చల ద్వారా కాశ్మీర్ సమస్యని పరిష్కరించుకోవాలని పాకిస్తాన్ కి సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే.
శాశ్వత సభ్య దేశమయిన చైనా కాశ్మీర్ మీద తీర్మానం తీసుకురావడానికి గాను చర్చనించాలని సభ్య దేశాలని కోరింది ఈ రోజు [16/08/19 At 7.30 p.m. IST ] కాశ్మీర్ విషయమయి సమావేశం జరగబోతున్నది. ఈ సమావేశం కేవలం కాశ్మీర్ మీద రిజల్యూషన్ తీసుకురావడానికి సభ్య దేశాల మద్దతు ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమె అదీ రహస్యంగా. అంటే ఈ సమావేశానికి సభ్యదేశాల ప్రతినిధులు మాత్రమె హారవుతారు కానీ విలేఖరులు,చూడడానికి వచ్చే ప్రేక్షకులని అనుమతించరు.
ఈ రోజు జరిగే సమావేశంలో అయిదు శాశ్వత సభ్య దేశాలతో పాటు మరో పది తాత్కాలిక సభ్య దేశాలు కూడా పాల్గొంటాయి. కాశ్మీర్ మీద ఒక అజెండా గా చర్చ జరిపి రిజల్యూషన్ తీసుకురావడానికి అందరి అంగీకారం ఉండాలి. అంటే శాశ్వత సభ్య దేశాలే కాకుండా తాత్కాలిక పది సభ్యదేశాలు కలిపి మొత్తం 15 దేశాలు వోటింగ్ లో పాల్గొననున్నాయి.ఈ 15 దేశాలలో 9 దేశాలు 'yes ' అంటేనే తుదపరి చర్యకి అవకాశం ఉంటుంది.
అమెరికాకి తమ F-18/A యుద్ధ విమానాలకి MMRCA.2[Medium Multi Roll Combat Aircraft] లో ఇంకా అవకాశాలు ఉన్నాయనే భావిస్తున్నది.వచ్చే సంవత్సరం జల ప్రవేశం చేయబోతున్న భారత రెండో యుద్ధ వాహక నౌక కి నావీ వెర్షన్ జెట్ ఫైటర్స్ అవసరం పడతాయి. ప్రస్తుతం రాఫెల్ ,మిగ్ ,లాక్ హీడ్ మార్టిన్ రెండు స్క్వాడ్రన్ ల [36 ] నావీ వెర్షన్ జెట్ ఫైటర్స్ కోసం పోటీ పడుతున్నాయి. గత వారం భారత నేవీ కి చెందిన అధికార బృందం అమెరికాలోని లాక్ హీడ్ మార్టిన్ ఆవరణలోని టెస్టింగ్ రేంజ్ మీద 'ski ' జంప్ మీదనుండి F-18 /A విజయవంతముగా TAKOFF అవ్వడాన్ని చూశారు.సో అమెరికా ఎట్టి పరిస్థితి లోనూ ఈ అవకాశం వదులుకోవడానికి ఒప్పుకోదు కాబట్టి ఈ రోజు 'NO ' చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అమెరికా వెంబడి బ్రిటన్ కూడా 'NO' చెప్తుంది సహజంగా. రష్యా కి S-400 తో చాల పని ఉన్నది భారత్ తో కాబట్టి రష్యా 'NO 'చెప్పేస్తుంది.ఇక ఫ్రాన్స్ సంగతి సరే సరి. 
చర్చకి పట్టుపడుతున్నది చైనా కాబట్టి తను 'NO ' అనేస్తుంది. ఇక మిగిలిన పది తాత్కాలిక సభ్య దేశాలు.1.బెల్జియం 2.ఐవరీ కోస్ట్ 3.డొమినికన్ రిపబ్లిక్ 4.ఈక్వటోరియల్ గునియా 5.జెర్మనీ 6.ఇండోనేషియా 7.కువైట్ 8.పేరూ 9.పోలాండ్ 10.సౌత్ ఆఫ్రికా . వీటిలో బెల్జియం రాడికల్ ఇస్లాం బాధితురాలు కాబట్టి 'NO ' చెప్పేస్తుంది. ఇక పోలాండ్ భారత్ కి చిరకాల మిత్ర దేశం కాబట్టి 'NO' చెప్పేస్తుంది.సౌత్ ఆఫ్రికా డిటో. జెర్మనీ,ఇండోనేషియా ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో తెలియదు. ఐవరీ కోస్ట్ తో భారత్ కి వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి 'NO' చెప్పేస్తుంది.
ఈ రోజు భారత కాలమాన ప్రకారం రాత్రి 7.30 లకి చైనా తన ప్రోపజల్ ని టేబుల్ మీదకి తెస్తుంది.8 గంటలకి వోటింగ్ తెలిసిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో .- పొట్లూరి పార్థసారది