Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజును కలిసిన పీవీ సింధు - vandebharath

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిసి దేశం గర్వపడేలా చేసిన తెలుగు తేజం పీవీ సింధు నిన్న రాత్రి స్విట్జర్లాండ్‌ నుంచి దిల్లీ చేర...




ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిసి దేశం గర్వపడేలా చేసిన తెలుగు తేజం పీవీ సింధు నిన్న రాత్రి స్విట్జర్లాండ్‌ నుంచి దిల్లీ చేరుకుంది.  ఈ ఉదయం సింధు, కోచ్‌ గోపీచంద్‌ కలిసి కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజును కలిశారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారుపతకం సాధించిన సింధును రిజిజు అభినందించారు.

ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీని కలిసిన అనంతరం సింధు, గోపీచందర్‌ హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. 
భారత స్టార్‌ క్రీడాకారిణి సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. ఈ సిరీస్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి క్రీడాకారిణిగా భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది.
ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఐదో సీడ్‌ సింధు 21-7,21-7తో మూడో సీడ్‌ నొజొమి ఒకుహర(జపాన్‌)ను చిత్తు చేసింది. కేవలం కేవలం 37 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించి, విశ్వవేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.